Sunday, May 19, 2024

వారంటి లేని కాంగ్రెస్‌ గ్యారెంటీలు ప్రజలకు ఎందుకు

spot_img

తెలంగాణకు సీఎం కేసీఆర్‌ పెద్ద గ్యారంటీ ఉండగా వారంటి  లేని కాంగ్రెస్‌ గ్యారెంటీలు ప్రజలకు ఎందుకని మంత్రి సబితా ఇంద్రారెడ్డి  ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చిన గ్యారంటీలు అక్కడ అమలు చేయడంలో విఫలం చెందగా తెలంగాణలో అమలు చేస్తామని ఇస్తున్న హామీలను ప్రజలు ఎవరూ కూడా నమ్మడం లేదన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని పలు డివిజన్లలో ఆమె ఇవాళ(ఆదివారం) రోడ్‌ షో  నిర్వహించారు.

కాంగ్రెస్‌ ఇస్తున్న మోసపూరిత మాటలను నమ్మవద్దని సూచించారు. ఎన్నికల తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తారని ఆరోపించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కేసీఆర్‌ నాయకత్వమే తెలంగాణకు, దేశానికి ఆదర్శమని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగని ఊరు లేదు.. సంక్షేమం అందని గడప లేదన్నారు. నియోజక వర్గంలో ప్రజల ఆశీర్వాదంతో బీఆర్‌ఎస్‌ జెండాను మరోసారి ఎగుర వేస్తామన్నారు. నిరంతరం ప్రజల మధ్య ఉండే ప్రజాప్రతినిధులకు ఓట్లేసి అండగా ఉంటామని ప్రజలు స్పష్టంగా హామీ ఇస్తున్నారని ఆమె తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేస్తామని, బీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తామని కాలనీలలో ఏక గ్రీవ తీర్మానాలు చేయడం ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎవరు ఎన్ని తప్పుడు వాగ్దానాలు చేసినా బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

Latest News

More Articles