Wednesday, May 8, 2024

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

spot_img

వనపర్తి జిల్లా : సంక్షేమంలో మనమే నంబర్ వన్ అని, కరోనా వల్ల దేశం మొత్తం స్తంభించినా ఒక్క తెలంగాణ రాష్టంలో మాత్రం వ్యవసాయం అగలేదని,  ఎందుకు కారణం సిఎం కెసిఆర్ అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నందిమల్ల గడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వహించడంతోపాటు జీ గార్డెన్ లో దివ్యాంగుల, సూర్య చంద్ర పాఠశాలలో ప్రవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

దివ్యంగులు పింఛన్ తీసుకునే స్థాయి నుండి పది మందికి ఉపాధి ఇచ్చే స్థాయి ఎదగాలని ఆకాంక్షించారు. చత్తీస్ ఘడ్, కర్ణాటక లో రూ.200, మధ్య ప్రదేశ్ , గుజరాత్ లో రూ.600 పింఛన్, దివ్యాంగులకు రూ.4016 ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దగ్గరకు రావచ్చని, రాలేని వారు తన నెంబర్ కు ఒక మెసేజ్ పెడితే.. సమస్య ను తీరుస్తానని చెప్పారు.

రాష్ట్ర పునర్నిర్మాణంలో మన వనరులు అన్నిటిని వాడుకుని రెండు సంవత్సరాలు కరోనా మూలంగా పోయిన కూడా మిగిలిన 7.5 ఏండ్ల కాలంలో వ్యవసాయం, ఆర్థిక పురోగతి, మిషన్ భగీరథ, ఐటి రంగాల్లో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రహదారులు, గుట్టలు, చెరువులు, కుంటలు, రిజర్వయర్ లో సాగునీళ్లు మినహా గుంట భూమి లేకుండా పచ్చగా వ్యవసాయం జరుగుతుందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

Latest News

More Articles