Sunday, May 19, 2024

ఆంధ్రావాళ్లకంటే ఎక్కువగా తెలంగాణ ను ముంచింది కాంగ్రెస్‌ పార్టేనే

spot_img

రాష్ట్రాన్ని ముంచింది ఆంధ్రావాళ్లకంటే ఎక్కువగా.. తెలంగాణ కాంగ్రెస్‌ దద్దమ్మలేనని  ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. జగిత్యాల నియోజకవర్గంలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘2004లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకుండా ధోఖా చేసింది. ఇక్కడ పీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణరావు అని ఉండేది. ఆయన మాతో మీరు గెలిచారా? మీతోని మేం గెలిచినమా? దమ్ముంటే రుజువు చేయ్‌ కేసీఆర్‌ అని సవాల్‌ విసిరిండు. నేను రాజీనామా చేసి ఆయన మొఖంమీద కొట్టిన. దమ్ముంటే రా నువ్వు.. మీ సంగతి మా సంగతి తేలుతదా అని మొఖాన కొట్టిన. నేను ఎంపీగా మళ్లీ పోటీ చేశాను. సమైక్యవాదుల తరఫున జీవన్‌రెడ్డి నాపై పోటీ చేసిండు. మీరందరూ సాక్ష్యులే. ఆ నాడు 2.50లక్షల మెజారిటీతో గెలిపించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులేపారు. ఆ పోరాటం మీ కండ్ల ముందే జరిగిందన్నారు.

ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థికి మజ్లిస్ పార్టీ నేతల మద్దతు

తెలంగాణ కాంగ్రెస్‌ దద్దమ్మలే 58 ఏళ్ల దుఃఖానికి ప్రధాన కారణమన్నారు సీఎం కేసీఆర్. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. తెలంగాణ కాంగ్రెస్‌ గట్టిగా నిలబడి ఉంటే.. ఈ గతి మనకు ఎందుకు అవుతుండే ? ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే ? అని అన్నారు.

ఆ రోజు ఉద్యమ స్పీచ్‌లలో నేను చెప్పేది.. కత్తి ఆంధ్రోనిదే కానీ.. పొడిచేటోడు మన తెలంగాణోడేనని. తెలంగాణను ముంచింది మొత్తం నోరుమెదపని కాంగ్రెస్‌ నేతల చేతగాని తనమే ఆరు దశాబ్దాలు తెలంగాణ ప్రజలను చాలా బాధపెట్టింది. ఈ విషయాలపై ప్రజలు ఆలోచించాలి. ప్రజాస్వామ్య పరిణితి అంటే అదే. పార్టీల చరిత్రను ఆలోచించాలి. ఏ పార్టీ వైఖరి ఏంటీ? నియ్యతి ఏందీ? ఏం చేస్తరని ఆలోచించాలి. అవకాశ వాదం తప్పా ఆరాటపడి ఎన్నడూ తెలంగాణ కోసం కాంగ్రెస్‌ పోరాడలేదన్నారు. జగిత్యాల మరింత అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు సీఎం కేసీఆర్.

ఇది కూడా చదవండి: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

Latest News

More Articles