Sunday, May 19, 2024

భ‌విష్య‌త్‌ను తీర్చిదిద్దే వారికే మీ ఓటెయ్యాలి

spot_img

ఖ‌మ్మం : ‘‘ఎన్నిక‌లు రాగానే ఆగ‌మాగం కావొద్దు. ఆలోచించాలి. ఏం చేస్తే లాభం జ‌రుగుత‌దో ఆ దారి ప‌ట్టాలి. అదే ప్ర‌జాస్వామ్యానికి దారి. ఓటును అల‌వోక‌గా వేయొద్దు. త‌మాషా కోసం వేయొద్దు. కార‌ణం ఏందంటే ఈ దేశంలో ప్ర‌జ‌ల చేతిలో ఉన్న వ‌జ్రాయుధం ఓటు. మీ త‌ల‌రాత మార్చేది.. భ‌విష్య‌త్‌ను తీర్చిదిద్దేది మీ ఓటే. హైద‌రాబాద్‌లో మేం ప‌ని చేస్తున్నామంటే అది మీరు ధార‌పోసిన శ‌క్తే. మీ శ‌క్తి లేక‌పోతే మేం చేసేది ఏం లేదు. ఓటు వేసే ముందు నిజ‌మైన పంథా ఎంచుకోవాలి.’’ అని కేసీఆర్ సూచించారు. ఇల్లందు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Also Read.. రాహుల్ గాంధీకి ఏం తెలుసు.. ధరణిని తీసేస్తామని మాట్లాడుతుండు

ఇల్లందు చాలా ఉద్య‌మాలు జ‌రిగిన ప్రాంతమని, చాలా చైత‌న్యం ఉండే ప్రాంతమని, పోరాటాల పురిటిగ‌డ్డ అని కేసీఆర్ అన్నారు. న‌వంబ‌ర్ 30న ఎన్నిక‌లు జ‌రిగేది ఖాయం.. డిసెంబ‌ర్ 3న‌ ఎవ‌రో ఒక‌రు గెలిచేది ఖాయమన్నారు. స్వతంత్రం వ‌చ్చి 75 ఏండ్లు గుడ‌స్తున్నా రాజ‌కీయ ప‌రిణితి, ప్ర‌జాస్వామి ప‌రిణితి రావాల్సిన అస‌వ‌రం ఉందన్నారు. పైస‌ల‌కు, ప్ర‌లోభాల‌కు లొంగకుండా ఓటు వేయాలని సూచించారు. ఓటర్లు ఆలోచించి చైత‌న్యంతో నిజ‌మేదో ఆలోచించి ఓటు వేయాలన్నారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గెలిచే స్థితి రానంత వ‌ర‌కు ఈ దేశం ఇలానే ఉంట‌దని కేసీఆర్ స్పష్టం చేశారు.

Also Read.. ద‌ళిత‌బంధు కోసం ఈ మొగోళ్లు ధ‌ర్నా చేశారా? ప్ర‌తిప‌క్షాల‌పై సీఎం కేసీఆర్ ఫైర్

చెడు ప్ర‌భుత్వం గెలిస్తే చెడ్డ ప‌నులు జ‌రుగుతాయని, కాంగ్రెస్, బీజేపీ పాల‌న చ‌రిత్ర‌ అందరికి తెలిసిన విషయమేనన్నారు. ఆయా పార్టీల వ్య‌వ‌హార‌శైలి, న‌డ‌క‌లు, వారు అవ‌లంభించిన ప‌ద్ద‌తులు గమనించాలని సూచించారు.  మ‌న అమూల్య‌మైన ఓటు స‌న్నాసికి వేస్తున్నామా..? స‌రైన వ్య‌క్తికి వేస్తున్నామా..? అని ఆలోచ‌న చేయ‌క‌ప‌సోతే మ‌న‌మే ఓడిపోతాం అని కేసీఆర్ అన్నారు. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్టింది ప‌ది.. చేసింది వంద‌ అని పేర్కొన్నారు. ద‌ళిత‌బంధు పెట్ట‌మ‌ని ఎవ‌రూ చెప్ప‌కున్నా అమలు చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికి మంచినీళ్లు, రైతుబంధు, రైతుబీమా కూడా ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్ట‌లేదని,  కానీ చేసుకుంటూ పోతున్నామని కేసీఆర్ చెప్పారు.

Latest News

More Articles