Tuesday, May 21, 2024

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్య‌మ ద్రోహి

spot_img

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్య‌మ ద్రోహి అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రోళ్ల‌కు అమ్ముడు పోయిన వ్య‌క్తి అని కేసీఆర్ ఫైర్ అయ్యారు. సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే అభ్య‌ర్థి చింతా ప్ర‌భాక‌ర్‌కు మ‌ద్ద‌తుగా మాట్లాడారు.

నేను సోష‌ల్ మీడియాలో చూశాను. ఇక్క‌డ గెలిచిన ఎమ్మెల్యే ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడు. నేను ఎస్పీ ఆఫీసు ముంద‌ర‌నే కారు గుద్దేసిన‌. నేను బూతులు క్యాప్చ‌ర్ చేసిన‌. ఓట్లు గుద్దుకున్న నేనే. ఈ ఎమ్మెల్యేలే కావాల్నా మ‌న‌కు..? ఈ ఎమ్మెల్యే మొద‌ట్లో టీఆర్ఎస్‌లో ఉండే. ఉద్య‌మ ద్రోహి అయి అమ్ముడు పోయిండు. ఆ విష‌యం కూడా మీకు తెలుసు. ఏనాడైనా ఉన్నాడా తెలంగాణ కోసం అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్.

తెలంగాణ‌కు శాప‌మే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. కిర‌ణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. తెలంగాణ‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌ను ఏం చేసుకుంటారో చేస్కోండి అని అన్నారు. తెలంగాణ‌కు చెందిన ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి అన్న రాజీనామా చేశారా..? అదే బీఆర్ఎస్ నాయ‌కులు ఎన్నిసార్లు రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి ప‌ద‌వులు, ఎమ్మెల్యే, ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి పేగులు తెగేదాకా తెలంగాణ కోసం కొట్లాడినం. కానీ వాళ్లు రాలేదు. ఉన్న తెలంగాణ‌ను ఆంధ్రాలో క‌లిపించింది తెలంగాణ కాంగ్రెస్సే. నీళ్లు ఇవ్వ‌క‌పోతే చ‌ప్పుడు చేయ‌నిది తెలంగాణ కాంగ్రెస్సే. ఉద్యోగాల్లో దోపిడీ జ‌రుగుతుంటే మాట్లాడ‌నిది తెలంగాణ కాంగ్రెస్సే.. మ‌ళ్ల ఇందిర‌మ్మ రాజ్యం తెస్త‌ర‌ట‌. ఎవ‌ర్నీ ఉద్ద‌రించ‌డానికి, ఇవాళ ఆప‌ద మొక్కులు మొక్కుతున్నారు అని కేసీఆర్ కాంగ్రెస్ నేత‌ల తీరుని విమర్శించారు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీ మాయమాటలను నమ్మి ప్రజలు మోసపోవద్దు

ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు డబ్బులు దుబారా చేస్తున్నాడని అంటున్నాడు. రైతు బంధు ఉండాలంటే BRS గెలవాలి. పీసీసీ చీఫ్ రేవంత్ 24 గంటల కరెంట్ వేస్ట్ అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్లు అధికారంలోకి వస్తే ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోతాయి. మూడేళ్లు కష్టపడి ధరణి తెచ్చాను. రాహుల్ గాంధీ, రేవంత్, భట్టి విక్రమార్క ధరణి తీసేస్తాం అంటున్నారు. ధరణి తీసేస్తే రైతు బంధు రాదు… దళారుల రాజ్యం వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం.గవర్నర్ వల్ల కాస్త ఆలస్యమైంది. అధికారంలోకి వచ్చాక అది కూడా చేస్తామన్నారు.

సంగారెడ్డి నేను పుట్టిన గడ్డ..నా జిల్లా. గత ఎన్నికల్లో చింతా ప్రభాకర్ ని ఓడగొట్టినా నేను ఏమి అనలేదు. 24 గంటల త్రాగునీరు వచ్చే విదంగా ఆలోచిస్తున్నాం. సంగారెడ్డి కి మెట్రో వస్తే మీ దశ మారిపోతుంది.మొదటి దశలో ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తే…రెండో దశలో సంగారెడ్డి వరకు మెట్రో  వేయవచ్చు. ఎమ్మెల్యేగా లేకున్నా చింతా ప్రభాకర్ కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశాడన్న సీఎం కేసీఆర్. ప్రభాకర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఇది కూడా చదవండి: రేపటి నుంచి మూడు రోజులు వైన్ షాపులు బంద్

Latest News

More Articles