Sunday, May 19, 2024

బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌ల్లే పాలేరుకు మోక్షం

spot_img

బీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌ల్లే పాలేరు నియోజ‌క‌వ‌ర్గానికి మోక్షం ల‌భించిందన్నారు సీఎం కేసీఆర్. నిన్న‌మొన్న‌టి దాకా కేసీఆర్ వ‌ల్ల మోక్షం వ‌చ్చింద‌ని మాట్లాడిన నాలుక‌లు.. న‌రం లేని నాలుక కాబ‌ట్టి వారే ఉల్టా మాట్లాడుతున్నారని అన్నారు. న‌రం లేని నాలుక మారొచ్చు.. కానీ స‌త్యం మార‌దు. నిజం నిజం లాగే ఉంటుంది. ఇవాళ(శుక్రవారం) పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని..మాట్లాడారు.

ఉద్య‌మ ప్రారంభంలో చాలా అవ‌మానాలు, అవ‌హేళ‌న చేశారని తెలిపారు సీఎం కేసీఆర్. దాదాపు  15 ఏండ్ల పోరాటం త‌ర్వాత యావ‌త్ తెలంగాణ ఒక ఉప్పెన అయి క‌దిలేతే దేశ రాజ‌కీయ ప‌రిస్థితి త‌ల‌వంచి తెలంగాణ ఇచ్చిందన్నారు. కాగ్రెస్ పార్టీ మోసం చేస్తే ఆ రోజు నేనే కేసీఆర్ శ‌వ‌యాత్ర‌నా.. తెలంగాణ‌ జైత్ర‌యాత్రనా.. అని ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టాను అని చెప్పారు సీఎం కేసీఆర్. ఆమ‌ర‌ణ దీక్ష‌కు పూనుకుంటే త‌న‌ను అరెస్టు చేసి ఇదే ఖ‌మ్మం జైల్లో పెట్టారని తెలిపారు. అనేక మోసాలు చేశారు. మాట‌ల‌తో న‌మ్మించారు. అన్నింటిని అధిగ‌మించి అలుపెర‌గ‌ని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామన్నారు.

భ‌క్త‌రామ‌దాసు లిఫ్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్టు ప్రారంభం చేసిన రోజు మ‌న‌ మాజీ డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి.. ప్ర‌త్యేకించి ఆయ‌న వ‌చ్చారు. పాలేరుకు మీరు ఎందుకు వ‌స్తున్నారంటే నాది కూడా పాలేరు నియోజ‌క‌వ‌ర్గ‌మే.. 45 ఏండ్ల‌లో 40 ఏండ్లు క‌రువుకాట‌కాల‌కు గురైంది. ఇవాళ మీరు నీళ్లు అందిస్తున్నారు. సంతోష‌మైంద‌ని వ‌చ్చాన‌ని మ‌హేంద‌ర్ రెడ్డి తెలిపార‌ని కేసీఆర్ గుర్తు చేశారు.

ప్ర‌జ‌ల్లో క‌లిసిపోయి మాట్లాడే నాయ‌కులు చాలా త‌క్కువ‌గా ఉంటారు. ఉపేంద‌ర్ రెడ్డి ఎమ్మెల్యేగా మీకు ఉండ‌టం అదృష్టం అని అన్నారు సీఎం కేసీఆర్.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ మెనిపెస్టోను ప్ర‌జ‌లు నమ్మ‌రు

Latest News

More Articles