Sunday, May 19, 2024

 ఏ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చేయని అభివృద్ధి మేం చేసినం

spot_img

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లయినా ఈ దేశంలో రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణతి రాలేదని తెలిపారు సీఎం కేసీఆర్‌. ప్రజాస్వామ్య పరిణతి సాధించిన దేశాల్లో అభ్యర్థి సామర్థ్యాలు, పార్టీల విధానాలను చూసి ఓటేస్తారని, మన దగ్గర కూడా ఆ పరిస్థితి రావాలని ఆయన ఆకాంక్షించారు. కానీ మన దగ్గర ఎన్నికలు రాగానే ఆగమాగం అయితరని, చెప్పుడు మాటలు నమ్మి ఓటేస్తరని, అట్ల జేస్తే న్యాయం జరుగదని, కాబట్టి ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు బాగా ఆలోచించాలని సీఎం సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు. రైతులకు 24 గంటలు కరెంట్ కావాలంటే జాన్సన్ నాయకు ను గెలిపించాలన్నారు.

ఎన్నికల్లో ఓటేసేటప్పుడు ఏ అభ్యర్థికి ఓటేస్తే మంచి జరుగుతది..? ఏ పార్టీ మంచిగ పనిచేస్తది..? అనేది ఆలోచించి ఓటేయాలె. అప్పుడే మనకు మంచి జరుగుతది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న ఓకే ఒక్క వజ్రాయుధం ఓటు. ఆ ఓటు హక్కును మనం సరిగ్గా వినియోగించుకుంటేనే మనకు మంచి జరుగుతది. అందుకే బాగా ఆలోచించి ఓటేయండి. ఓటేసేటప్పుడు పార్టీల చరిత్రను చూడండి. బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు అధికారంలో ఉన్నది. ఆ 50 ఏండ్ల కాలంలో ప్రజల కోసం కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదు. రాష్ట్రమంతా కరువు కాటకాలు ఉండేవి. ప్రజా సంక్షేమం సరిగ్గా జరగలే. అదిగాక ఉన్న తెలంగాణను ఆంధ్రాతో కలిపి అన్యాయం చేశారు. మళ్ల మన రాష్ట్రాన్ని మనం సాధించుకోవడానికి 58 ఏండ్లు పట్టింది. చాలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తేగానీ తెలంగాణ సాధ్యంగాలే. కాబట్టి ఓటు వేసేటప్పుడు మీరు బాగా ఆలోచించాలె. పార్టీల చరిత్రను బేరిజు వేసుకుని ఓటేయాలి. ఎవరికి ఓటేస్తే మంచి జరుగుతది అనేదానిపై మీ గ్రామాల్లో, తండాల్లో చర్చ జరగాలె. అప్పుడే రాయేదో.. రత్నమేదో తేలుతుంది. మంచి సర్కారు ఏర్పాటైతదన్నారు సీఎం కేసీఆర్.

తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్‌ పార్టీ రూ.200 పెన్షన్‌ ఇచ్చేది. మేం అధికారంలోకి వచ్చిన దాన్ని రూ.1000 చేసినం. తర్వాత దాన్నిరూ.2 వేలకు పెంచినం. అంతేగాదు.. ఈ ఎన్నికల్లో గెలువగానే ఆసరా పెన్షన్‌ను రూ.5 వేలకు పెంచుతానని నేను సంతోషంగా ప్రకటిస్తున్నా. చరిత్రలో ఏ కాంగ్రెస్‌ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి గూడా చేయని తీరుగ ఆలోచన చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినం. ఆడబిడ్డ పెండ్లి కోసం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ రూపంలో రూ.లక్ష ఇస్తున్నం. ఒకప్పుడు ప్రభుత్వ దవాఖాన అంటే నరకం ఉండె. ఇప్పుడు గర్భిణిలను అమ్మ ఒడి వాహనాల్లో ఆస్పత్రులకు తీస్కపోయి, వాళ్లకు కావాల్సిన మందులు ఇప్పించి, ప్రసవానికి తీస్కపోయి, మగబిడ్డ పుడితే రూ.12 వేలు ఇచ్చి, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు ఇచ్చి, కేసీఆర్‌ కిట్‌ ఇచ్చి, తిరిగి అమ్మ ఒడి వాహనాల్లోనే క్షేమంగా ఇళ్లకు చేరుస్తున్నామన్నారు సీఎం కేసీఆర్.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ కే నా మద్దతు

 

 

 

Latest News

More Articles