Sunday, May 19, 2024

బీఆర్ఎస్ కే నా మద్దతు

spot_img

బీఆర్ఎస్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గంగారాం. కామారెడ్డి జిల్లా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం ప్రెస్ మీట్ లో ఈ విషయం తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కొందరు నాకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. ఏళ్లుగా ఎలాంటి పదవి లేకున్నా కాంగ్రెస్ జెండా మోస్తున్నా.

అలాంటిది కాంగ్రెస్ పార్టీ దళితుడైన తనకు సీట్ ఇవ్వకుండా మున్నూరుకాపా,ఎస్సీ అని తెలియని వ్యక్తికి సీట్ ఎలా ఇచ్చింది. తాను కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీలు మారకుండా ఉంటే టికెట్ రాలేదు. బోధన్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి.. పార్టీకి ద్రోహం చేసినా టికెట్ ఇచ్చారు. దళితుడైన నాకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇరిగేషన్ మంత్రిగా ఉండి సుదర్శన్ రెడ్డి  వెయ్యి కోట్లు అవినీతి చేస్తే టికెట్ ఇస్తారు, ఆరోపణలు లేని గంగారాం కు టికెట్ ఎందుకు ఇవ్వరన్నారు. జుక్కల్ సెగ్మెంట్ లో గంగారాం పని అయిపోయిందని ప్రచారం చేస్తున్న వారికి తన సత్తా చూపేందుకు ఈ సారి గంగారాం అభిమానులు బీఅర్ ఎస్ కు ఓటు వేయాలని కోరుతున్నా అని అన్నారు.

ఇది కూడా చదవండి: ఎన్నికల అంటే ఐదు సంవత్సరాలు భవిష్యత్తు

Latest News

More Articles