Sunday, May 5, 2024

ఎన్నికల అంటే ఐదు సంవత్సరాలు భవిష్యత్తు

spot_img

ఎన్నికల అంటే ఐదు సంవత్సరాలు భవిష్యత్తు అని తెలిపారు మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో పాల్గోని మాట్లాడారు మంత్రి. మణికొండ సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఎలా ఉందో అర్ధం చేసుకోవాలన్నారు. మహారాష్ట్రలో వారానికి ఒక్కసారి నల్లా వస్తుంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు నీళ్లు కోసం ధర్నాలు చేస్తుండే. తెలంగాణ వచ్చిన తర్వాత విపక్షాలు నీళ్లు కోసం ఎప్పుడైనా మాట్లాడాయా, ధర్నా లు చేశాయా అని అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత మంచి నీటి సమస్య తీర్చడం జరిగింది. సీఎం కేసీఆర్ వచ్చిన తరవాత 24గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తుం. కర్ణాటక లో 5గంటలు పవర్ హాలిడే ఉంది.కేసీఆర్ పాలనలో కరెంట్ కోతలు లేవు, కర్ఫ్యూలు లేవన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందన్నారు మంత్రి హరీశ్ రావు. బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్ అందుబాటులో ఉండే మనిషి. భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవదన్నారు.

ఇది కూడా చదవండి: నవంబర్‌ 29 తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజు

సంపద పెంచు.. పేదలకు పంచు అంటారు సీఎం కేసీఆర్.మూడు కొత్త వరాలు మహిళలు ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్. సౌభాగ్య లక్ష్మి ద్వారా మూడు వేలు రూపాయిలు ఇవ్వనున్నారు.400 రూపాయలకు గ్యాస్ ఇవ్వనున్నారు. పేదలు కడుపు నిండా అన్నం తినాలని సన్న బియ్యం ఇవ్వనున్నారు. కాంగ్రెస్ని నమ్మితే మోసపోతాము. కాంగ్రెస్ లో అందరూ ముఖ్యమంత్రులే. కాంగ్రెస్ వాళ్ళది శృతి లేని సంసారం. కర్ణాటక లో కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సభలు పెట్టి గ్యారింటీ లు అన్నారు. రాహుల్ గాంధీ కర్ణాటక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశలు కల్పిస్తాం అని నిరుద్యోగ భృతి ఇస్తాం అని అక్కడ మోసం చేశారని తెలిపారు మంత్రి హరీశ్ రావు.

ప్రకాష్ గౌడ్ ని ఇక్కడ గెలిపించండి మణికొండ లో 100 పడకల ఆసుపత్రిని కడుతామన్నారు. నగరం నలువైపులా సూపర్ స్పెషలాటి అసుపత్రులను కడుతున్నామన్నారు. ఇక్కడ అభివృద్ధి మనకు కనపడుతుంది, బయటకెళ్లి వచ్చిన సినీ నటుడు రజినికాంత్ కు కనిపిస్తుంది కానీ,ఇక్కడ ఉండే కాంగ్రెస్ గజినీ గాళ్ళకు కనిపిస్తలేదన్నారు మంత్రి హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్,బీజేపీ నేతలు పొలిటికల్ టూరిస్ట్ లు

Latest News

More Articles