Tuesday, May 21, 2024

కాంగ్రెస్,బీజేపీ నేతలు పొలిటికల్ టూరిస్ట్ లు

spot_img

కాంగ్రెస్, బీజేపీ నేతలు పొలిటికల్ టూరిస్ట్ లని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. వీళ్ళు తెలంగాణ ప్రజలను మోసం చేసి కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం మాత్రమే పనిచేసే వాళ్ళున్నారు.నిజామాబాద్ జిల్లా నవిపేటలో ఎమ్మెల్యే షకీల్ తో కలిసి రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత. ఇది ఎన్నికల మీటింగ్ లా లేదు ఇది విజయోత్సవ సభల ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల చర్చ జరుగుతోంది. మాట తప్పని నేత సీఎం కేసీఆర్. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేశారు.2014 కట్ ఆఫ్ ను బీడీ కార్మికుల పెన్షన్ లో ఎత్తివేస్తాం. ఎన్నికల తర్వాత ప్రతి ఒక్క బీడీ కార్మికురాలకు పెన్షన్ ఇచ్చుకుంటాం. కొత్తగా పెండింగ్ లో  ఉన్న రేషన్ కార్డులను మంజూరు చేస్తాం. ఎలాంటి ఆధారం లేని వాళ్లకు సౌభాగ్యలక్ష్మి ఒక వరం వంటిది. రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ 5లక్షల కేసీఆర్ బీమా ఇస్తాం. 15 లక్షల రూపాయల వైద్య సహాయం పథకం అమలు చేస్తాం. స్వంత జాగలు ఉన్న వారికి 3 లక్షల గృహ లక్ష్మి పథకం నిరంతరంగా కొనసాగిస్తాం. వచ్చే ఐదేళ్లలో ప్రతి నీరు పేదలకు సొంత ఇళ్లు ను నిర్మించి ఇస్తామన్నారు.

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ అని అన్నారు ఎమ్మోల్సీ కవిత. మూడు గంటల కరెంటు ఇచే వాళ్ళు కావల్నా, 24 గంటల కరెంట్ ఇచ్చే వాళ్ళు కావాలా ఆలోచన చేయాలన్నారు. పెద్ద మనసుతో మూడో సారి బీఅర్ ఎస్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.

ఇది కూడా చదవండి: నవంబర్‌ 29 తెలంగాణ జాతిని ఏకీకృతం చేసిన రోజు

 

Latest News

More Articles