Sunday, May 5, 2024

రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే నాధ్యేయం

spot_img

తండాలను పంచాయితీలుగా చేసిన  గొప్పమానవతవాధి సీఎం కేసీఆర్  అని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని సూర్యాపేట రూరల్ మండలం రాజా నాయక్ తండ, లక్ష్మీ నాయక్ తండ, చివ్వెంల మండలం బడితండ,పీర్ల తండా,మున్యానాయక్ తండ, పాండ్య నాయక్ తండా లో ఎన్నికల  ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం గిరిజన తండాలు, గూడేలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడే నాటి వరకు తండాలను పట్టించుకున్న ప్రభుత్వాలే లేవన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. స్వరాష్ట్రంలోనే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని అన్నారు. మిషన్‌భగీరథతో స్వచ్ఛమైన తాగునీరు అందిస్తు న్నామని తెలిపారు. తండాలకు రహదారులు నిర్మించామన్నారు. గతంలో జరిగిన అభివృద్దిని, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్దిపై బేరీజు వేయాలని ప్రజలకు సూచించారు.గత ప్రభుత్వాలు తండాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదు.. కేవలం ఓటుబ్యాంక్ గానే చూశాయని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని 3,146 గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన సీఎం కేసీఆర్‌ గిరిజనుల ఆరాధ్యుడన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు. గిరిజన కుటుంబ సంఘటన నుంచే కల్యాణలక్ష్మి పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారని త్వరలో భూమిలేని గిరిజనుల కోసం గిరిజన బంధు పథకం వస్తుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి గిరిజనులు అండగా నిలువాలని కోరారు.

సూర్యాపేట లో జరిగిన అభివృద్ధి మీ కళ్ళ ముందే కనబడుతుందని అన్నారు. గతంలో పాలించిన దామోదర్ రెడ్డి తన హయాంలో ఏమి చేయకపోగా, కొట్లాటలను ఘర్షణలను ప్రోత్సహించి, మూడు కొట్లాటలు ఆరు కేసులను ఇచ్చాడే తప్ప గిరిజన అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ఎన్నికలవేళ మాయమాటలు చెబుతున్న దామోదర్ రెడ్డిని ఏం చేశాడో ప్రజలే ప్రశ్నించాలని కోరారు మంత్రి జగదీష్ రెడ్డి. మళ్లీ ఆశీర్వదిస్తే ఎకరానికి లక్ష ఆదాయం వచ్చే విధంగా చేయడమే నా లక్ష్యం అన్నారు. రైతులు ఆర్థికంగా ఎదగాలనిన్నదే నాధ్యేయమన్న మంత్రి, దానికి కావాల్సిన ప్రణాళిక నా దగ్గర సిద్ధంగా ఉందన్నారు. మరోసారి ఆశీర్వదిస్తే , డ్రై పోర్టు తీసుకొచ్చి వేలాదిమందికి ఉపాధి కల్పిస్తానని అన్నారు. రాబోయే డ్రైపోర్టుతో మీ భూముల ధరలకు రెక్కలు వస్తాయని, అందరూ కోటీశ్వరులు కావడం ఖాయం అన్నారు. తండాలలో అభివృద్ధిని పరుగులు పెట్టించి ..నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరు గర్వపడేలా చేస్తానన్నారు జగదీష్ రెడ్డి.

ఇది కూడా చదవండి: ఎన్నికల అంటే ఐదు సంవత్సరాలు భవిష్యత్తు

Latest News

More Articles