Monday, May 6, 2024

కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు.. కరెంటు ఉంటే కాంగ్రెస్ ఉండదు

spot_img

తెలంగాణకు నష్టం చేసిన వారు వచ్చి ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‎లో రోడ్ షో పాల్గొని.. బీఆర్ఎస్ అభ్యర్ధి సునీత లక్ష్మారెడ్డి తరఫున ప్రచారం చేశారు. ఈ రోడ్ షోలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘భారీగా తరలివచ్చిన జనాలను చూస్తే సునీతారెడ్డి గెలుపు ఖాయమని అనిపిస్తుంది. 2014 ముందు కరెంట్ కోసం పడ్డ కష్టాలు గుర్తుంచుకోండి. కరెంటు కష్టాలు కాంగ్రెస్ నాయకులకు తెలియదు. బీసీ బిడ్డ గొంతు కోసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్ అమ్ముకున్నాడు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదు.. కరెంటు ఉంటే కాంగ్రెస్ ఉండదు. కౌలు రైతుకు రైతుబంధు ఇచ్చేది లేదని కాంగ్రెస్ అనలేదా? రైతుబంధు దుబారా అని రేవంత్ రెడ్డి అనలేదా? 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 73000 కోట్లు వేసిన ఘనత కేసీఆర్‎ది. తెలంగాణకు నష్టం చేసిన వారు వచ్చి ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి కొడంగల్‎లో, కామారెడ్డిలో ఓడిపోతాడు.

రైతుబంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమాలు ప్రవేశపెట్టిన కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు రకరకాల డ్రామాలు వేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తా అని మోడీ అనలేదా? రూ. 400 ఉన్న సిలిండర్ ధరను రూ. 1200లు చేసిన ఘనత మోడీది. తండాలను గ్రామపంచాయతీ చేసిన ఘనత కేసీఆర్‎ది. అసైన్డ్ భూములకు కేసీఆర్ పట్టాలు చెయ్యబోతున్నాడు. సునీతా రెడ్డి గెలుపొందితే నర్సాపూర్‎కు ఐటీ హబ్, పరిశ్రమలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేపడతాం. మదన్ రెడ్డికి సముచిత స్థానం ఉంటుంది, బీఆర్ఎస్ నాయకులకు న్యాయమైన స్థానం కల్పిస్తాం. బీఆర్ఎస్ గెలిస్తే నర్సాపూర్‎ను చార్మినార్ జోన్‎లో కలుపుతాం.

Latest News

More Articles