Friday, May 17, 2024

థింక్‌ బిగ్‌ లైక్‌ కేసీఆర్‌..డ్రీమ్‌ బిగ్‌ లైక్‌ కేసీఆర్‌

spot_img

హైదరాబాద్‌: ‘థింక్‌ బిగ్‌ లైక్‌ కేసీఆర్‌-డ్రీమ్‌ బిగ్‌ లైక్‌ కేసీఆర్‌’ అంటూ సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్‌ ను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన వివిధ పథకాల ఫొటోలను జతచేస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. తెలంగాణ అభివృద్ధికి చిహ్నాలు ఇవేనంటూ.. ప్రతిపక్షాలకు కౌంటర్లు కూడా ఇస్తున్నారు.

‘ఒక్క కేసీఆర్‌.. ఎన్నో అద్భుతాలు’ అనే యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నది. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం దృశ్యాలు, డ్రోన్ల వీడియోలను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు.  ‘పిలిచినా ఏడుపే.. పిల్వకున్నా ఏడుపే.. గుజరాతోళ్ల చెప్పులు మోసే వీళ్లకి(బీజేపీ నేతలు) అసలు తెలంగాణ అభివృద్ధి అంటేనే ఏడుపు. ఇక కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరు పెట్టడం కూడా వీరికి ఏడుపే’ అంటూ ఓ నెటిజన్‌ బీజేపీకి కౌంటర్‌ ఇచ్చారు.

Latest News

More Articles