Wednesday, May 22, 2024

ఉద్యమ కళాకారుడికి సీఎం కేసీఆర్ ఫోన్.. హైదరాబాద్ రావాలని సూచన

spot_img

సీఎం కేసీఆర్ మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కళాకారుడికి సాయమందించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం, ఎండ్రియాల్ గ్రామానికి చెందిన విఠల్ రెడ్డి ఓ కళాకారుడు. ఆయన 2001లో ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆయన గురించి తాజాగా సీఎం కేసీఆర్ ఆరా తీశారు.

Read Also: ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ‘సుప్రీం’ కీలక ఆదేశాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‎ని కలవడానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సోమవారం ప్రగతి భవన్‎కు వెళ్లారు. ఎమ్మెల్యేతో మాట్లాడుతూ.. ఆనాటి ఉద్యమకారుడు విఠల్ రెడ్డి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
ఉద్యమ సమయంలో పల్లెబాటలో భాగంగా ఎండ్రియాల్‎లో ముఖ్యమంత్రి కేసీఆర్ బస చేశారు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ.. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే విఠల్ రెడ్డి ఆరోగ్యం సరిగా లేదని ఎమ్మెల్యే చెప్పడంతో.. వెంటనే విఠల్ రెడ్డికి ఫోన్ కలపాలని ఎమ్మెల్యే సురేందర్‎కి కేసీఆర్ చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ఫోన్ కలపడంతో కళాకారుడు విఠల్ రెడ్డితో సీఎం కేసీఆర్ నేరుగా ఫోన్ మాట్లాడారు.

ఆయన ఆరోగ్యం గురించి అడిగిన తర్వాత.. ఉద్యమ సమయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై గొంతెత్తి పాడిన పాటలను, పాడిన సందర్భాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్‎కు రావాలని విఠల్ రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వెంటనే విఠల్ రెడ్డికి వైద్య సహాయం అందించాలని ఎమ్మెల్యే జాజాల సురేందర్‎ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుపెట్టుకొని మరీ ఫోన్ చేయడం ఆనందంగా ఉందని ఉద్యమకారుడు విఠల్ రెడ్డి అన్నారు.

Read Also: సుపారీ ఇచ్చి మరీ కొడుకును హత్య చేయించిన తల్లిదండ్రులు

Latest News

More Articles