Tuesday, April 30, 2024

పిల్లి అనుకొని చేరదీస్తే అది పులి అయింది.. వైరల్ వీడియో

spot_img

ఈ కాలంలో చాలామంది పెంపుడు జంతువులను ఇష్టంగా పెంచుకుంటున్నారు. కొంతమంది కుక్కలను పెంచుకంటే, మరికొంతమంది పిల్లి, చిలుక, పావురం ఇలా రకరకాల పక్షులను పెంచుకుంటున్నారు. అలా ఓ మహిళ పిల్లి అనుకొని పెంచుకుంటే అది పులి అయింది.

Read Also: సుపారీ ఇచ్చి మరీ కొడుకును హత్య చేయించిన తల్లిదండ్రులు

రష్యాకు చెందిన ఓ మహిళ ఓ రోజు రోడ్డు పక్క నుంచి నడుచుకుంటే వెళ్తూ.. చెట్లలో ఏదో శబ్దం విన్నది. వెంటనే వెళ్లి చూడగా.. అప్పుడే పుట్టిన పిల్లికూన కనిపించింది. చూడటానికి ముద్దుగా ఉన్న ఆ పిల్లి పిల్లను వెంటనే చేతుల్లోకి తీసుకొని తనతో పాటే ఇంటికి తీసుకెళ్లింది. అప్పటికే తన ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కతో పాటు దీన్ని కూడా జాగ్రత్తగా పెంచుకుంది. అయితే కొన్నాళ్లు గడిచిన తర్వాత పిల్లి పిల్లతో తేడా గమనించింది. అది అసలు పిల్లి కాదు పులి పిల్ల అని గుర్తించింది. తాను తీసుకువచ్చి, పెంచుకుంటున్నది బ్లాక్ పాంథర్ అని తెలుసుకుంది. అయినా కూడా ఏ మాత్రం భయపడకుండా.. తన పెంపుడు కుక్కతో పాటుగా దాన్ని ప్రేమగా పెంచుకుంది. దాంతో ఆ మహిళకు, పెంపుడు కుక్కుకు, పులి పిల్లతో మంచి అనుబంధం ఏర్పడింది. రోజూ ఆ మహిళతో పాటు కుక్కతో కలిసి ఆడుకోవడం పులి పిల్లకు అలవాటయింది.

Read Also: కళాకారుడితో నేరుగా ఫోన్ మాట్లాడిన సీఎం కేసీఆర్

అయితే పులి పిల్ల దొరికనప్పటి నుంచి అది పెద్దది అయి.. తమతో ఆడుకునే వరకు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 21న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆ వీడియోకు మిలియన్లలో వ్యూస్‌ వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by @factmayor

Latest News

More Articles