Saturday, May 4, 2024

‘చంద్రుడు జైల్లో హ్యాపీగా ఉన్నారు’.. చంద్రబాబు అరెస్ట్‎పై అసదుద్దీన్ హాట్ కామెంట్స్

spot_img

స్కిల్ డెవలప్‎మెంట్ స్కాం కేసులో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‎లో ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి అరెస్ట్ మీద ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ ప్రజలు చంద్రబాబుని ఎప్పుడూ నమ్మొద్దని అన్నారు. ‘ఏపీలో చంద్రుడు హ్యాపీగా జైల్లో ఉన్నారు. చంద్రబాబు ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసు. సీఎం జగన్ పాలన మంచిగానే ఉంది. చంద్రబాబును మాత్రం నమ్మలేం. ప్రజలు కూడా చంద్రబాబుని ఎప్పుడూ నమ్మకండి’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

Read Also: పిల్లి అనుకొని చేరదీస్తే అది పులి అయింది.. వైరల్ వీడియో

ఇప్పటికే 18 రోజుల నుంచి రిమాండ్‎లో ఉన్న చంద్రబాబు నాయుడి కస్టడీ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆయన తరపు న్యాయవాదులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. కస్టడీ పొడిగింపుపై కౌంటర్ దాఖలు చేసిన తర్వాత కస్టడీ పొడిగింపు, బెయిల్ పిటీషన్… రెండు పిటీషన్లపై ఈ రోజు ఒకేసారి వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది.

Read Also: కరోనా కన్నా భయంకరమైన వైరస్.. కనీసం 5 కోట్ల మంది చనిపోయే ప్రమాదం

అదేవిధంగా ఈ రోజు ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో బెయిల్‎తో పాటు.. అంగళ్లు విధ్వంసం కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణ చేయనున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంలో చంద్రబాబు నాయుడు A1గా ఉన్నారు.

Read Also: కళాకారుడితో నేరుగా ఫోన్ మాట్లాడిన సీఎం కేసీఆర్

ఇకపోతే చంద్రబాబు తరపు న్యాయవాదులు ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకు మరోసారి వెళ్లనున్నారు. చంద్రబాబు పిటిషన్‎ మీద త్వరగా విచారణ చేపట్టాలని ఆయన తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా కోర్టును సోమవారం విజ్ఞప్తి చేశారు. అయితే పిటిషన్‎ను ముందు మెన్షన్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ఆ తర్వాత కేసు విచారణ తేదీని నిర్ణయిస్తామని జడ్జి చెప్పారు. అందులో భాగంగానే ఈ రోజు చంద్రబాబు కేసు విచారణ తేదీని ప్రకటించనున్నారు. కాగా.. ఎల్లుండి నుంచి అక్టోబర్ రెండు వరకు సుప్రీంకోర్టుకు సెలవులు కావడం గమనార్హం. ఈ క్రమంలో ఈ రెండు రోజుల్లోనే కేసు విచారణకు వస్తుందా లేక సెలవుల తర్వాత వస్తుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Read Also: సుపారీ ఇచ్చి మరీ కొడుకును హత్య చేయించిన తల్లిదండ్రులు

Latest News

More Articles