Friday, May 3, 2024

‘స్క్రిప్ట్, రైటర్, షల్ వి మీట్’.. కోడ్ లాంగ్వేజ్‎తో సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ సప్లై

spot_img

మాదాపూర్ డ్రగ్స్ కేసులో యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా.. ఈ కేసులో నిందితులుగా ఉండి, పరారీలో ఉన్న కలహర్ రెడ్డి, హిటాచి సాయి, స్నార్ట్ పబ్ ఓనర్ సూర్య ఈ రోజు పోలీసులు ఎదుట లొంగిపోనున్నారు. డ్రగ్స్ కేసు తీవ్రతరం కావడంతో ఈ ముగ్గురు నిందితులు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దాంతో వారిని పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. డ్రగ్స్ కేసులో A13గా కలహర్ రెడ్డి, A18గా సూర్య, A22గా హిటాచి సాయి ఉన్నారు.

Read Also: ‘చంద్రుడు జైల్లో హ్యాపీగా ఉన్నారు’.. చంద్రబాబు అరెస్ట్‎పై అసదుద్దీన్ హాట్ కామెంట్స్

ఇప్పటి వరకు ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. మరికొంత మంది డ్రగ్స్ కన్జ్యూమర్స్‎కు నోటీసులు జారీ చేశారు. సినీ ఇండస్ట్రీలో వివిధ పేర్లతో డ్రగ్స్ సప్లై జరుగుతున్నట్లు కనిపెట్టారు. స్క్రిప్ట్, రైటర్, షల్ వి మీట్ .. అనే కోడ్ లాంగ్వేజ్‎తో సరఫరా చేస్తున్నారని నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే హీరో నవదీప్‎ను నార్కోటిక్ బ్యూరో అధికారులు ఆరు గంటల పాటు విచారించారు. విచారణలో నవదీప్ 40 మంది డ్రగ్ కన్జ్యూమర్స్ పేర్లను చెప్పినట్లు సమాచారం.

Read Also: పిల్లి అనుకొని చేరదీస్తే అది పులి అయింది.. వైరల్ వీడియో

Latest News

More Articles