Sunday, May 19, 2024

అప్పుడలా ఇప్పుడిలా.. 6 నుండి 9వ ఫ్లోర్‌కి సీఎం రేవంత్

spot_img

తెలంగాణ సచివాలయంలో తొమ్మిదో ఫ్లోర్‌లోకి మారనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సచివాలయంలో ప్రస్తుతం ఆరో అంతస్తులో రేవంత్ రెడ్డి చాంబర్ ఉంది. అయితే ఈ చాంబర్ నుండి 9వ అంతస్తులోకి మారాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. తెలంగాణ సచివాలయంలోని 9వ అంతస్తును రేవంత్ రెడ్డి ఇవాళ పరిశీలించారు.

రేవంత్ రెడ్డి కి తొమ్మిది లక్కీ నెంబర్. దీంతో 9వ, ఫ్లోర్ లోకి రేవంత్ రెడ్డి మారనున్నారు. 9వ, ఫ్లోర్ లో రేవంత్ రెడ్డి చాంబర్ లో అవసరమైన ఇంటీరియర్, ఫర్నీచర్ ను సిద్దం చేస్తున్నారు అధికారులు. అయితే ఇవే విషయాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై అప్పట్లో పని కట్టుకుని విమర్శలు చేసేవారు. వాస్తు, దైవం, హిందూ ధర్మాన్ని అధికంగా విశ్వసించే కేసీఆర్ చేసే ప్రతి పనిని మూఢ నమ్మకమని అవమానించిన వారిలో ఈ రేవంత్ కూడా ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మీరెలా సెంటిమెంట్స్ ని నమ్మి ఫ్లోర్స్ మారుతున్నారు, మీ నమ్మకాల కోసం అదనంగా ఛాంబర్ తయారీకి ఖర్చు ఎందుకని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్.

Latest News

More Articles