Monday, May 6, 2024

జీహెచ్ఎంసీకి మరో జాతీయ అవార్డు

spot_img

హైదరాబాద్:   నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో జీహెచ్ఎంసీ యేటా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కించుకుంటుంది.  తాజాగా జీహెచ్ఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్-2023 జాతీయ అవార్డుకు ఎంపిక అయ్యింది. 2024 జనవరి 11వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర గృహ పట్టణాభివృద్ది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా జాతీయ స్థాయి అవార్డును అందుకోనున్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్ -2023 అవార్డులో భాగంగా ఒక లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న సిటీలను (నేషనల్ ర్యాంకింగ్), ఒక లక్ష కంటే తక్కువ ఉన్న జనాభా సిటీ (స్టేట్ అండ్ జోనల్ ర్యాంకింగ్) లో ఎంపిక చేసి అవార్డు ప్రధానం చేస్తారు. జీహెచ్ఎంసీ వాటర్ ప్లస డ్రైయిన్స్ నుండి వేస్ట్ వాటర్ పర్యావరణానికి హాని కలిగించకుండా ఎస్.టి.పి ల ద్వారా శుద్ధి చేసి బయటకు పంపించడం జరుగుతుంది. ఇందుకు గాను గత రెండు సంవత్సరాల నుండి వాటర్ ప్లస్ సిటీ గా మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ సర్టిఫై చేసి త్రీ స్టార్ హోదాను కల్పిస్తుంది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ్ -2023 లో గార్బేజ్ ఫ్రీ సిటీలో ఇదివరకు త్రీ స్టార్ సిటీ ర్యాంకింగ్ జాబితాలో ఉండగా, తాజాగా 5 స్టార్ రేటింగ్ పొందనున్నది.  జీహెచ్ఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ్ కింద 2015 నుండి 2022 వరకు 10 లక్షల జనాభా కంటే ఎక్కువ సిటీ జాబితాలో ర్యాంకింగ్ సాధించింది.

స్వచ్ఛ సర్వేక్షణ్-2018 లో గ్రేటర్ హైదరాబాద్ కు బెస్ట్ స్టేట్ క్యాపిటల్ అవార్డు పొందింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2019లో బెస్ట్ మెట్రో సిటీ అవార్డు దక్కింది. ఇదే సంవత్సరంలో ఓ.డి.ఎఫ్++ పొందింది. 2019 సంవత్సరంలో జిహెచ్ఎంసి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు ను పొందింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2020 లో బెస్ట్ మెగా సిటీ, ఇన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ అవార్డు పొందింది. 2021 సంవత్సరంలో బెస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ మెగా సిటీ అవార్డును పొందడం ద్వారా త్రీ స్టార్ హోదాను పొందింది. ఇదే సంవత్సరంలో వాటర్ ప్లస్ సర్టిఫికెట్ ను మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్, హౌసింగ్ ద్వారా పొందింది. 2022 సంవత్సరంలో గార్బేజ్ ఫ్రీ సిటీ కింద త్రీ స్టార్ హోదా ను పొందింది.  తిరిగి ఈ సంవత్సరం కూడా రీ-సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది.

జాతీయ స్థాయిలో జీహెచ్ఎంసీకి అవార్డు రావడం మరింత బాధ్యత పెరిగిందని జాతీయ స్థాయిలో గ్రేటర్ కు అవార్డు దక్కడంలో  విశేష కృషినచేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందద్భంగా మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రోస్ ధన్యవాదాలు తెలిపారు.

Latest News

More Articles