Saturday, May 4, 2024

స్టాఫ్‌నర్స్‌ పోస్టుల మెరిట్‌ లిస్ట్‌పై అభ్యంతరాలు

spot_img

స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీలో భాగంగా ప్రాథమిక మెరిట్‌ లిస్ట్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. స్టాఫ్‌ నర్స్‌ అభ్యంతరాలను స్వీకరించి నివృత్తి చేయాలని రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఆదేశించింది. స్టాఫ్‌ నర్స్‌ అభ్యర్థుల అభ్యంతరాలు నివృత్తి చేయాలని అధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు.

జనవరి 15వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించాలని టీఎస్‌ హెల్త్ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఆదేశించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన సందేహాలను ఈ నెల 17వ తేదీలోగా నివృత్తి చేయాలని చెప్పారు. ఈ క్రమంలో ఎవరైనా అర్హులుగా తేలితే వారిని సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు అనుమతించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే బోర్డు కూడా ప్రెస్‌ నోటు విడుదల చేసింది. స్టాఫ్‌నర్స్‌ అభ్యర్థులు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.

Latest News

More Articles