Wednesday, May 22, 2024

ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న సబ్ స్క్రిప్షన్ చార్జీ!

spot_img

హైదరాబాద్: కరోనా మహమ్మారితో సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌ల కాలం వచ్చేసింది. దీనితోపాటు కంటెంట్ ఖర్చులు పెరిగి పోవడంతో ఆయా టీవీ చానెళ్లు వినియోగదారులపై భారం మోపేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ సంస్థల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా, వయాకాం 18 సంస్థలు తమ ఖాతాదారుల నెలవారీ సబ్ స్క్రిప్షన్ చార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

Also Read.. ఓటేసిన ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటే

నెట్ వర్క్ 18, వయాకాం18 డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇండియా కాస్ట్.. తమ కస్టమర్లపై చానెళ్ల సబ్ స్క్రిప్షన్ చార్జీ 20-25 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ 9-10 శాతం, సోనీ 10-11 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. డిస్నీ స్టార్ ఎంత చార్జీ పెంచుతున్నట్లు వెల్లడించలేదు. ప్రతిపాదిత చార్జీలను రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ (ఆర్ఐఓ)లో ప్రచురించిన 30 రోజుల తర్వాత సబ్‌స్క్రిప్షన్ చార్జీల పెంపు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం.. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి బ్రాడ్ కాస్టర్ల పెరిగిన సబ్‌స్క్రిప్షన్ చార్జీలు అమల్లోకి రానున్నాయి.

Latest News

More Articles