Monday, May 6, 2024

ఓటేసిన ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటే

spot_img

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం  కొత్త సంక్షేమ పథకాలను ప్రారంభించకపోగా గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గృహలక్ష్మి పథకం రద్దుతో లక్షలాది మంది లబ్ధిదారులు నష్టపోతున్నారు. గృహలక్ష్మి ఎన్నికల కోడ్ ముందే అమల్లోకి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి మేము వ్యతిరేకం  కాదు. గృహలక్ష్మి పథకం లబ్ది దారులను ఇందిరమ్మ ఇండ్ల పథకంలో చేర్చనైనా చేర్చండి. లేదంటే గృహలక్ష్మి పథకాన్ని అలాగే కొనసాగించండి  అని డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.

Also Read.. స్వచ్ఛ అవార్డుల్లో తెలంగాణ సత్తా

‘‘దళిత బంధు కింద లబ్ధిదారుల ఎంపిక జరిగింది. దళిత బంధును ఆపమని ఉత్తర్వులు ఇచ్చారు. దళిత బంధు పథకంలో సాయాన్ని పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చి ఉన్న పథకాన్నే ఎత్తి వేస్తున్నారు. దళితులకు కాంగ్రెస్ అన్యాయం చేయొద్దు. రైతు ఋణ మాఫీ ,రైతు బంధు తదితర అంశాల పై కూడా కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తగ్గట్టు వ్యవహరించడం లేదు. ఖరీఫ్ వరి పంటకు బోనస్ ఇస్తామన్నారు. యాసంగి కి కూడా ఇస్తారో లేదో తెలియదు.

Also Read.. మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి కి ఎవరు బ్రీఫింగ్ ఇస్తున్నారో తెలియడం లేదు. సీఎం కనీస హోం వర్క్ చేయడం లేదనిపిస్తోంది. ఫార్మా సిటీ ,మెట్రో రైలు ఫై సీఎం వైఖరి కొన్ని రోజుల్లోనే మారింది. అదానీ ప్రధాని అని నాగపూర్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి  హైదరాబాద్ లో ఆదానీకి రెడ్ కార్పెట్ పరిచారు. 6 గ్యారంటీల్లో పదమూడు హామీలు ఉన్నాయి. రెండు హామీలు అమలు చేసి రెండు గ్యారంటీలు అమలు చేశామని పెద్ద పెద్ద పత్రికా ప్రకటనలు ఇచ్చి ప్రజా ధనం దుర్వినియోగం చేస్తోంది.

Also Read.. రాయదుర్గంలో కిడ్నాపైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్షేమం

నిరుద్యోగ భృతిపై కూడా మాట మార్చారు. కాంగ్రెస్ వైఖరి మోసం దగాలతో కూడినది. కాంగ్రెస్ 420 హామీల పై కచ్చితంగా మాట్లాడుతాం. మేము తొందర పడటం లేదు ..కాంగ్రెస్ హామీల తేదీలను గుర్తు చేస్తున్నాం. కాంగ్రెస్ కు ఓటేసిన ప్రజలను మోసం చేయడం అలవాటే. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ హామీ పైనా స్పష్టమైన విధానం లేదనిపిస్తోంది. కాంగ్రెస్ హామీల సంఖ్య 420 ..కాంగ్రెస్ పార్టీ ని మేము చార్ సౌ బీస్ పార్టీ అని అనడం లేదు. వాళ్ళ హామీలు చార్ సౌ బీస్. ప్రజా దర్బార్ పై కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ మాటలు మాట్లాడుతోంది.’’ అని అన్నారు.

Latest News

More Articles