Sunday, May 19, 2024

బీఆర్ఎస్ పై కక్ష సాధింపేనా కాంగ్రెస్ విధానం?

spot_img

హైదరాబాద్: పెద్దపల్లి పార్లమెంటు సన్నాహక సమావేశంలో ఏడు నియోజకవర్గాల ముఖ్యమైన కార్యకర్తలు పాల్గొన్నారని, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ సారి కచ్చితంగా గులాబీ జెండా ఎగురవేయాలని కార్యకర్తలు కృత నిశ్చయంతో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సుమారు ఏడు గంటల పాటు చర్చ జరిగిందన్నారు. కార్యకర్తల అభిప్రాయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళతామని తెలిపారు.

Also Read.. జైలుకు వెళ్లేందుకు సిద్ధమా? కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్ల సవాల్

కాంగ్రెస్ దుష్ప్రచారం ,ఇచ్చిన అలవి కాని హామీల వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైందన్నారు. పెద్ద పల్లి పార్లమెంటు నియోజక వర్గం ఏడు అసెంబ్లీలు తాము కోల్పోయినా ఎంపీ సీటు కచ్చితంగా గెలుస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కోల్ బెల్ట్ ఏరియాలో బీఆర్ఎస్ కార్యకర్తల పై దాడులు కొనసాగుతున్నాయి. ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయడం మాని బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకుంది. కాంగ్రెస్ విధానం బీఆర్ఎస్ పై కక్ష సాధింపేనా? అని ప్రశ్నించారు.

Also Read.. మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఛార్జీలపై ఆర్బీఐ కీలక నిర్ణయం

కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు వరసగా కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుండటం దుర్మార్గం. నియంతృత్వ ఫాసిస్ట్ పోకడలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వెళుతోంది. ప్రజాపాలన పేరిట రేవంత్ ప్రభుత్వం దరిద్రపు పాలన చేస్తోంది. కుటుంబ పాలన అన్న కాంగ్రెస్ పార్టీ ఇపుడు ఎమ్మెల్యేలుగా ఒకే కుటుంబం వారిని ఎందుకు చేసింది. రేవంత్ దే కుటుంబ పాలన ,కబ్జా పాలన నడుస్తోంది. రేవంత్ సోదరులు అధికారిక మీటింగ్ లలో పాల్గొనడం కుటుంబ పాలన కాదా అని నిలదీశారు.

Also Read.. పెండింగ్ చలానా రాయితీ గడువు మరో 5 రోజులే!

రెవెన్యూ తదితర కీలక మైన శాఖల్లో కీలకమైన పోస్టింగ్ లను రేవంత్ సోదరులే నిర్ణయిస్తున్నారు. రేవంత్ మనుషులు విచ్చలవిడిగా సిటీ చుట్టుప్రక్కల లే అవుట్ లు వేస్తున్నారు. ఉద్యోగులకు జీతాలిచ్చాం అని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. మరి రైతుబంధు ఎంత మందికిచ్చారో ఎందుకు చెప్పడం లేదు. రైతు బంధు కోసం తాము దాచిన పైసలు ఏ కాంట్రాక్టర్ జేబుల్లోకి వెళ్లాయని ఆయన ప్రశ్నించారు.

Latest News

More Articles