Friday, May 17, 2024

హైదరాబాద్ లో సరికొత్త పెలికన్ సిగ్నల్స్.. ఇక ట్రాఫిక్ తో ‘నో’ టెన్షన్..!

spot_img

హైదరాబాద్‌లో బిజీ రోడ్డులో రోడ్డు దాటాలంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు ఆ కష్టాలు తీరాయి. ప్రస్తుతం నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఆటోమెటిక్‌గా ఆపరేట్ అవుతుంటాయి.దాంతో వాహనాలు ఎప్పుడు ఆగుతాయో పాదచారులకు తెలుసు. కాబట్టి ఒకట్రెండు నిమిషాలు ఆగి, రోడ్డు దాటి వెళ్తుంటారు. కానీ ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం లేని రోడ్లు కొన్ని ఉంటాయి. కానీ అక్కడ రోడ్డు దాటాలంటే పాదచారులకు కష్టమే. వారికి పెలికన్ సిగ్నల్స్ ఉపయోగపడతాయి. ఎవరైనా పాదచారులు రోడ్డు దాటాలనుకున్నప్పుడు ఈ సిగ్నల్ యాక్టివేట్ చేయొచ్చు.

పెలికన్ సిగ్నల్ దగ్గర ఉన్న వాలంటీర్ లేదా పాదచారులు ఎవరైనా ఈ సిగ్నల్ ఆపరేట్ చేయొచ్చు. పెలికన్ సిగ్నల్ ఆన్ చేయగానే రెడ్ సిగ్నల్ పడుతుంది. రెడ్ సిగ్నల్ పడగానే వాహనాలు ఆగుతాయి. పాదచారులు రోడ్డు దాటడానికి 15 నుంచి 20 సెకండ్ల సమయం లభిస్తుంది. ఆ టైమ్‌లో సులువుగా రోడ్డు దాటొచ్చు. పాదచారులు ప్రమాదాలకు గురికాకుండా పెలికన్ సిగ్నల్స్ ఇలా ఉపయోగపడుతున్నాయి. విదేశాల్లో పెలికన్ సిగ్నల్స్ చాలా చోట్ల కనిపిస్తాయి.

హైదరాబాద్‌లో కొన్ని జంక్షన్లలో రోడ్డు దాటడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు కూడా ఉంటాయి. అయితే ప్రతీ చోటా ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు నిర్మించడం అంత సులువైన విషయం కాదు. అలాంటి ప్రాంతాల్లో పెలికన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం వాహనదారులకు ఉపయోగపడుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 94 పెలికన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడానికి జీహెచ్ఎంసీ అనుమతిచ్చింది. వాటిలో 30 హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అందుబాటులో ఉన్నాయి. మిగతా రెండు కమిషనరేట్ల పరిధిలో కూడా పెలికన్ సిగ్నల్స్ ఏర్పాటు కానున్నాయి.

Latest News

More Articles