Thursday, May 2, 2024

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే ఎన్నిక నిర్వహించాలి.. వేర్వేరు నోటిఫికేషన్ల ఆంతర్యమేమిటి?

spot_img

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఒకే ఎన్నిక నిర్వహించకుండా రెండు ఎన్నికలు నిర్వహించడంలో ఆంతర్యమేమిటని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు. ఇటీవల ఎమ్మెల్యేలుగా ఎన్నికైన  కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరు గతంలో 09-11-2021 రోజున ఒకే నోటిఫికేషన్ ద్వారా ఎమ్మెల్సీలుగా ఎన్నిక అయ్యారని, ఎన్నికల కమిషన్ వీరి స్థానంలో కొత్త వారిని ఎన్నిక చేసేందుకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, హైకోర్టు న్యాయవాది భరత్, ఇతర లీగల్ సెల్ సభ్యులతో కలిసి చర్చించి ఎన్నికల అధికారులకు లిఖితపూర్వకంగా ఒక లేఖ సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Also Read.. ఓటేసిన ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్‌కు అలవాటే

కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరో నలుగురు ఒకే  నోటిఫికేషన్ ద్వారా ఎమ్మెల్సీలు గా ఎన్నిక కావడం జరిగిందని, 03-12-2023 రోజున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత ఒకే రోజు రాజీనామా చేసి ఒకే సారి రాజీనామాలు ఆమోదం పొందటం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులు రెండు ఎన్నికలు నిర్వహించడం ఎంత వరకు సబబన్నారు. రెండు ఎన్నికలు నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరేలా ఉందని పేర్కొన్నారు. గతంలో ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇలాంటి సందర్భాలు వచ్చాయని, దీనిపై ఎన్నికల కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలని ఆయన పేర్కొన్నారు.

Latest News

More Articles