Friday, May 17, 2024

మరోసారి జిల్లాల పునర్విభజన యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం!

spot_img

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ ప్రజోపయోగం కోసం 10 జిల్లాలను 31 జిల్లాలుగా మార్చారు. ఇలా అయితేనే ప్రభుత్వ పనులు, పథకాలు ప్రజలకు చేరువ అవుతాయని భావించారు. అయితే రాష్ట్రంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటుచేసిన విధానంపై పునర్విచారణ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో 33 జిల్లాల పేర్లు చెప్పలేని పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం ఒక జిల్లాలో మూడునాలుగు జడ్పీటీసీలు మాత్రమే ఉన్నాయి. జడ్పీ సమావేశం నిర్వహిస్తే ముఖముఖాలు చూసుకోవటం తప్ప మరేమీ ఉండట్లేదు. ఒక ఎంపీ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. అవి కూడా మూడునాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. ఆ ఎంపీ ఏదైనా చేయాలంటే ఆ మూడునాలుగు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడాల్సి వస్తున్నది. 33 జిల్లాల పేర్లు గుర్తుపెట్టుకోవటం కూడా కష్టంగా ఉన్నది. జిల్లాలు, మండలాల విభజనపై బడ్జెట్‌ సమావేశాల్లో చర్చిస్తాం. దీనికోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో కమిషన్‌ వేస్తాం. ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకొంటాం’ అని సీఎం రేవంత్ తెలిపారు.

Latest News

More Articles