Wednesday, May 22, 2024

న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేసి కంపెనీ మేనేజర్ బ్లాక్‎మెయిల్

spot_img

న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేసి మహిళలను బెదిరిస్తున్న ఓ కంపెనీ మేనేజర్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రశేఖర్ అనే వ్యక్తి హెర్బా లైఫ్ సంస్థలో మేనేజర్‎గా పనిచేస్తున్నాడు. దాంతో వెయిట్ లాస్ కావాలనుకునే వారు చంద్రశేఖర్ తో తరచూ మాట్లాడేవారు. అటువంటి వారితో చంద్రశేఖర్ చనువు పెంచుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత వారితో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడేవాడు. ఆ సమయంలో వారి వీడియోలు రికార్డ్ చేసిన చంద్రశేఖర్.. అవి బయటపెడతానని బెదిరింపులకు దిగాడు. అతగాడి చేష్టలతో విసిగిపోయిన.. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. చంద్రశేఖర్ ను అరెస్ట్ చేశారు. గతంలో రాయదుర్గంలో ఓ మహిళను ట్రాప్ చేసి, బ్లాక్ మెయిల్ చేసిన కేసులో చంద్రశేఖర్.. జైలుకు కూడా వెళ్లి రావడం గమనార్హం.

Latest News

More Articles