Friday, May 17, 2024

రెండోస్థానం కోసమే కాంగ్రెస్‌, బీజేపీ పోటీ

spot_img

హైదరాబాద్‌ : తెలంగాణలో బీఆర్‌ఎస్‌ దే అధికారం. కారుకు ప్రభంజనానికి ఎదురు నిలిచేవారే లేరు. రెండోస్థానం కోసమే కాంగ్రెస్‌, బీజేపీ పోటీ అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ విజయ ఢంకా మోగించి హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు.

Also Read.. మైనర్ బాలికను హత్య చేసి ఆపై అత్యాచారం..!!

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం పక్కా అని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల పేర్కొనగా.. తాజాగా ప్రముఖ సెఫాలజిస్టులు డా.సందీప్‌ శాస్త్రి, సంజయ్‌ కుమార్‌ కూడా ఇదే మాట చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయని ‘ఇండియా టుడే’ శుక్రవారం ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు స్పష్టం చేశారు.

Also Read.. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నరా? ఈ హోం రెమెడిస్‎తో తొందరగా తగ్గించుకోండి…!!

కాంగ్రెస్‌, బీజేపీలతో పోలిస్తే బీఆర్‌ఎస్‌కు గెలిచేందుకు ఎక్కువ అవకాశం ఉందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లోఓటమి ఖాయమని స్పష్టం కావడంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్‌, బీజేపీ బరిలోకి దిగుతున్నాయని వారు తెలిపారు.

Latest News

More Articles