Tuesday, May 21, 2024

జానారెడ్డికి షాక్.. నాగార్జునసాగర్‎లో నామినేషన్ తిరస్కరణ

spot_img

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన వేసిన నామినేషన్‎ను తిరస్కరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. పలువురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 5563 అప్లికేషన్లు వచ్చాయి. కాగా, ఇందులో కేవలం 2444 అప్లికేషన్లను మాత్రమే ఎన్నికల సంఘం ఆమోదించింది. ఇక 594 మంది అప్లికేషన్లను రిజెక్ట్ చేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఈటెల రాజెందర్ సతీమణి జమున అప్లికేషన్లు కూడా ఉండటం గమనార్హం.

Read Also: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్

కాంగ్రెస్ పార్టీ తరఫున నాగార్జునసాగర్ నుంచి జానారెడ్డి, ఆయన కొడుకు జైవీర్ రెడ్డి ఇద్దరూ నామినేషన్ వేశారు. అయితే జానారెడ్డి నామినేషన్‎ను ఎన్నికల అధికారులు తిరస్కరించడం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక భారతీయ జనతా పార్టీ తరపున ఈటల జమున వేసిన నామినేషన్ కూడా తిరస్కరించారు. బీఫాం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. ప్రతి ఎన్నికలో ఈటలతో పాటుగా జమున కూడా నామినేషన్ వేయడం ఆనవాయితీగా వస్తోంది.

Read Also: దంచికొడుతున్న వానలు.. రెండు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు బంద్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు నామినేషన్లు, కరీంనగర్ మానకొండూరులో ఏడు నామినేషన్లు, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి మూడు నామినేషన్లను తిరస్కరించారు. కొల్లాపూర్ నుంచి 21 మంది నామినేషన్లు దాఖలు చేయగా 18 మందివి ఆమోదం పొందాయి. సరైన పత్రాలు సమర్పించకపోవడంతో మిగిలిన మూడింటిని తిరస్కరించారు.

Latest News

More Articles