Saturday, May 18, 2024

ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగిస్తున్న ‘పిరోలాస’..!!

spot_img

న్యూఢిల్లీ: కరొనా మళ్లీ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తుంది. క‌రోనా మ‌హ‌మ్మారి కొత్త వేరియంట్లు ఇటీవల మళ్లీ ఉనికిలోకి వస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ‘పిరోలాస ( BA.2.86)’ అనే వేరియంట్ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్నాయి. ఇది ఒమిక్రాన్ వేరియంట్ సబ్ వేరియంట్‌ అని నిపుణులు చెబుతున్నారు.

Cricket ఇంగ్లండ్‌పై శ్రీ‌లంక చారిత్రాత్మ‌క విజ‌యం..!!

కొత్త వేరియంట్‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ‘వేరియంట్ అండ‌ర్ మానిట‌రింగ్‌’గా వ‌ర్గీక‌రించింది అలెర్ట్ జారీచేసింది. ఒరిజిన‌ల్ వేరియంట్‌తో పోలిస్తే ‘పిరోలా’ 35 కంటే ఎక్కువ ఉత్ప‌రివ‌ర్త‌నాల‌ను క‌లిగి ఉందని, దీంతో ఇది వేగంగా సంక్రమిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

MK Stalin సనాతన ధర్మంపై దుమారం.. తమిళనాడులో సీఎం స్టాలిన్ కొడుకు భారీ కాంట్రవర్సీ

ఇప్పటివరకు పిరోలా వేరియంట్ కేసులు ఇజ్రాయెల్, కెనడా, డెన్మార్క్, యూకే, దక్షిణాఫ్రికా, స్వీడన్, నార్వే, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్ దేశాల్లో న‌మోద‌య్యాయి. కొత్త వేరియంట్‌కు సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ జ‌రుగుతోంద‌ని, నిజానికి ఈ వేరియంట్ ఎంత తీవ్ర ప్ర‌భావం చూపుతుందో ఇంకా తెలుసుకోవాల్సి ఉంద‌ని నిపుణులు తెలిపారు. అదే సమయంలో పిరోలా తీవ్రతకు సంబంధించి తెలుసుకోవాల్సి ఉంద‌ని అమెరికాకు చెందిన కార్డియాల‌జీ నిపుణుడు, స్క్రిప్స్ రీసెర్చ్ ట్రాన్స్‌స్లేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్ట‌ర్ ఎరిక్ టోపోల్ పేర్కొన్నారు.

Latest News

More Articles