Friday, May 17, 2024

రేప‌టి నుంచే వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్.. కౌంట్‌డౌన్ స్టార్ట్

spot_img

అహ్మాదాబాద్‌: ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌ కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. రేప‌టి నుంచే వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. అహ్మాదాబాద్ వేదిక‌గా తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ ఢీకొట్ట‌నున్న‌ది. 2019లో జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఈ రెండు జ‌ట్లే త‌ల‌ప‌డిన విష‌యం తెలిసిందే.

Also Read.. అబద్ధానికి కేరాఫ్ ప్రధాని మోదీ

ఇంగ్లండ్ జ‌ట్టు మాత్రం మేటి బ్యాట‌ర్ల‌తో బ‌లంగా క‌నిపిస్తోండగా.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్‌స‌న్‌, బౌల‌ర్ టిమ్ సౌథీలు గాయాలతో దూరమవ్వడంతో కివిస్ కొంత బలహీనంగా కనిపిస్తుంది. ఐపీఎల్‌లో ఆడిన అనుభ‌వం ఉన్న ఇంగ్లండ్ ఆట‌గాళ్ల‌కు ఇండియా పిచ్‌లు మ‌రింత అనుకూలించే అవ‌కాశాలు ఉన్నాయి. 2015, 2019 వ‌న్డే టోర్నీల్లో న్యూజిలాండ్ జ‌ట్టు ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్లింది.

Also Read.. బీజేపీ గెలవదు.. కాంగ్రెస్ లేవదు.. గెలిచేది కేసీఆర్ మాత్రమే

బెన్ స్టోక్స్‌తో పాటు జోస్ బ‌ట్ల‌ర్‌, జానీ బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్‌, జో రూట్‌, డేవిడ్ మ‌లాన్, హ్యారీ బ్రూక్‌ లాంటి హిట్టర్లు ఇంగ్లండ్ జ‌ట్టు బలంగా ఉంది. మొయిన్ అలీ, క్రిస్ వోక్స్‌, సామ్ క‌ర్ర‌న్ లాంటి ఆల్‌రౌండ‌ర్లు కూడా ఆ జ‌ట్టుకు ప్లస్ కానున్నారు. న్యూజిలాండ్ జ‌ట్టులో డారిల్ మిచ‌ల్‌, డేవ‌న్ కాన్వేలు మంచి ఫామ్‌లో ఉన్నారు. స్టాండ్ ఇన్ కెప్టెన్ గా టామ్ లాథ‌న్, జేమ్స్ నీషామ్‌, గ్లెన్ ఫిలిప్స్ బ్యాటింగ్ లో.. బౌలింగ్ విభాగంలో బౌల్ట్ ఫామ్‌లోకి రావ‌డం కివీస్‌కు క‌లిసి వ‌చ్చే అంశం.

Latest News

More Articles