Sunday, May 19, 2024

అబద్ధానికి కేరాఫ్ ప్రధాని మోదీ

spot_img

హైదరాబాద్‌ : బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబద్ధం అనే పదానికి పర్యాయపదాలని మరోమారు స్పష్టమైందని, ఎన్నికల కోసం బీజేపీ ఏ స్థాయిలో దిగజారుడు రాజకీయాలు చేస్తుందో నిజామాబాద్‌ సభలో మోదీ మాట్లాడిన దానిని బట్టి అర్థం చేసుకోవచ్చని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీపై మండిడ్డారు.

Also Read.. బీజేపీ గెలవదు.. కాంగ్రెస్ లేవదు.. గెలిచేది కేసీఆర్ మాత్రమే

అసలు మోదీ పుట్టిన తేదీ అబద్ధం. చాయ్ అమ్మింది అబద్ధం. చదువు అబద్ధం. తలా రూ.15 లక్షలు ఇస్తానన్నది అబద్ధం. అచ్చేదిన్ తెస్తానని చెప్పింది అబద్ధం. ఆయన, మాటలు, చేతల్లో ఒక్కటి కూడా నిజం లేదని విమర్శించారు. అబద్ధాల పునాదుల మీద పుట్టి.. జనాలకు అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి మోదీ తెలంగాణకు వచ్చి నిజాలు ఎలా మాట్లాడతాడు. బీజేపీకి తెలంగాణలో పుట్టగతులు లేకుండా పోయాయన్నారు. దీంతో ఫ్రస్టేషన్ లో నోటికొచ్చిన అబద్ధాలన్ని చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించి నాలుగు ఓట్లు వేయించుకుందామనే కుటిల ప్రయత్నం చేశారు. సిగ్గు,ఎగ్గు వదిలేసి ప్రధాని పదవికి ఉన్న గౌరవాన్ని దిగజార్చేలా మాట్లాడారని మండిపడ్డారు.

Also Read.. వెంటిలేటర్ మీద ఉన్న బీజేపీని కాపాడుకోవడానికి మోడీ నానాపాట్లు పడుతున్నారు

నిజామాబాద్‌లో మోదీ మాట్లాడిన దాంట్లో ఒక్క మాట కూడా వాస్తవం లేదు. మోదీ మాట్లాడిన దాన్నిబట్టి చూస్తే రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంకా ఎంత నీచానికి దిగజారుతారు. కుటిల రాజకీయాలు చేస్తారనేది ఊహించుకోవచ్చు అన్నారు. రాష్ట్రంలో అబద్ధాలు ప్రచారం చేసి అల్లకల్లోలం సృష్టించి తద్వారా ఓట్లు వేయించుకోవాలనే దుష్ట సంప్రదాయానికి బీజేపీ ప్రణాళికలు చేసినట్టు దీని ద్వారా స్పష్టమవుతున్నది. కాబట్టి ఫేక్ ఫ్యాక్టరీ అయిన బీజేపీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Latest News

More Articles