Saturday, May 11, 2024

రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో మరో డ్రగ్‌ పెడ్లర్‌ అరె​స్ట్‌

spot_img

హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ తెలిపారు. అతనితో పాటు ఇవాళ(బుదవారం) నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడిన ఆయన..వారి దగ్గర నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నాం. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్‌లో అమ్ముతున్నారు. హైదరాబాద్‌లో ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్‌గా డ్రగ్స్ సేల్ చేస్తున్నారు. హైదరాబాదులో 15 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. పబ్బులకు వెళ్లే యూత్‌ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్  అమ్ముతున్నారు.

హైదరబాద్‌తో పాటు గోవా, బెంగళూరు వంటి మెట్రో నగరాలు పబ్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో అమ్ముతున్నారు. సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్‌పై నగరంలో డ్రగ్స్ కేసులో ఆరు కేసులున్నాయి. గచ్చిబౌలి, మలక్‌పేట్‌, చాదర్గాట్ , యాదగిరిగుట్ట పీఎస్‌లో కేసులు ఉన్నాయి. డ్రగ్స్ అమ్మగా వచ్చిన ఆదాయాన్ని రెహమాన్ విలాసవంతమైన కార్ల కొనుగోలుకు ఖర్చు చేస్తాడు. రెహమాన్ ఫైజల్ అనే డ్రగ్ పెడ్లర్ అండర్‌లో పనిచేస్తాడు.

డ్రగ్స్ కింగ్ ఫిన్ పైజల్ గోవా జైల్లో ఉన్నాడు.. అతని ఆదేశాల మేరకు రెహమాన్ డ్రగ్స్ అమ్ముతాడు. ఫైజాల్‌ను పిటీ వారింట్‌పై హైదరాబాద్‌కు తీసుకుని వస్తాం. రాడిసన్ పబ్ కేసులో వహీద్ అనే వ్యక్తి సయ్యద్ రహ్మన్‌తో డ్రగ్స్ కొనుగోలు చేశాడు. రాడిసన్ కేసులో ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ వినీత్‌ చెప్పాడు.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లో రూ.16,400 కోట్ల అప్పులు చేసింది

Latest News

More Articles