Sunday, April 28, 2024

లక్నోకు షాక్ మరో ఇంగ్లీష్ పేసర్ దూరం.!

spot_img

ఎల్లుండి ఐపీఎల్ సీజన్ 17 షురూ కానుంది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ మరో షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్, ఇంగ్లీష్ ఆటగాడు డేవిడ్ విల్లే ఈ టోర్నీ ఫస్టాప్ మ్యాచులకు దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ప్రారంభ మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదని స్వయంగా లక్నో హెడ్ కోచ్ జస్టిన్ లంగర్ వెల్లడించారు. గత రెండు నెలలుగా ఇంటర్నెషనల్ లీగ్ టీ 20 తోపాటు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడిన డేవిడ్ విల్లే ఐపీఎల్ ఆరంభ మ్యాచులకు దూరమయ్యాడు.

గత రెండు సీజన్లలో ఆర్సీబీకి ఆడిన విల్లేను ఈ సీజన్ కు ముందు నిర్వహించిన వేలంలో కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2కోట్లకు దక్కించుకుంది. అయితే ఇప్పుడు అతను 2024 సీజన్ ఫస్ట్ షెడ్యూల్ కు దూరమయ్యాడు. రెండు రోజుల క్రితమే పీఎల్ ఎల్ ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడిన విల్లే అక్కడి నుంచి నేరుగా లండన్ కు వెళ్లాడు. విల్లే రెండో షెడ్యూల్ వరకైనా తిరిగొస్తాడా లేక సీజన్ మొత్తానికి దూరం అవుతాడా అనేదానిపై స్పష్టత ఇంకా రాలేదు. లక్నో కూడా విల్లే రిప్లేస్ మెంట్ ను ప్రకటించలేదు.

ఇక లక్నో టీమ్ లో ఆడుతూ ఈ సీజన్ కు దూరమైన రెండో పేసర్ విల్లే. అంతకుముందు మరో ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ కూడా ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. రాబోయే టీ 20 వరల్డ్ కప్ కోసం వర్క్ లోడ్ మేనేజ్ మెంట్లో భాగంగా ఈ టోర్నీకి దూరమయ్యాడు. వుడ్ స్థానాన్ని లక్నోకాగా, మార్క్ వుడ్ తో పాటు ఈ సీజన్ నుంచి జేసన్ రాయ్, గస్ అట్కిన్సన్ హ్యారీ బ్రూక్ లు ఇప్పటికే పలు కారణాలతో దూరం అయ్యారు.

ఇది కూడా చదవండి: రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో మరో డ్రగ్‌ పెడ్లర్‌ అరె​స్ట్‌

Latest News

More Articles