Saturday, May 11, 2024

చెస్ ప్రపంచ ఛాంపియన్ గా డింగ్‌ లిరెన్‌

spot_img

చైనా చెస్ ఆటగాడు డింగ్‌ లిరెన్‌(30) చెస్ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. ఇయాన్‌ నెపోమ్నిషి (రష్యా)ని టైబ్రేక్‌లో 2.5-1.5తో ఓడించి నయా ఛాంపియన్ గా అవతరించాడు. పద్నాలుగు గేముల్లో లిరెన్‌-ఇయాన్‌ చెరో ఏడు గేమ్‌లలో విజయం సాధించారు. దీంతో విజేతను తేల్చడానికి ఆదివారం టైబ్రేక్‌ నిర్వహించారు.

ప్రపంచ విజేత అయిన తొలి చైనా ఆటగాడిగా డింగ్‌ లిరెన్‌ రికార్డు సృష్టించాడు. భారత్ కు చెందిన విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఆసియా నుంచి ప్రపంచ విజేత అయింది లిరెన్‌ మాత్రమే కావడం గమనార్హం. మహిళల ప్రపంచ ఛాంపియన్‌ టైటిల్‌ ను కూడా చైనాకే చెందిన వెన్‌జువాన్‌ గెలుపొందింది.

ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పదేళ్ల కార్ల్‌సన్‌ ఏకచక్రాధిపత్యానికి డింగ్‌ లిరెన్‌ గెలుపుతో తెరపడింది. వ్యక్తిగత కారణాలతో ఈసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఆడటం లేదని డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కార్ల్‌సన్‌ ప్రకటించాడు.

Latest News

More Articles