Friday, May 17, 2024

జనవరి 3న ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్

spot_img

హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ – 1 లోని సంతోష్ నగర్ వద్దనున్న 1600 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైనుకు జంక్షన్ పనులు చేపడుతున్నారు. ఎస్ఆర్డీపీలో భాగంగా నల్గొండ – ఓవైసీ డౌన్ ర్యాంప్ అలైన్ మెంట్ లో ఉన్న సంతోష్ నగర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులకు ఇబ్బందులు కలగకుండా ఈ జంక్షన్ పనులు చేయనున్నారు. ఈ పనులు జనవరి 3వతేదిన ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు జనవరి 4 ఉదయం 6 గంటల వరకు జరుగుతాయి. ఈ 24 గంటలు కింద పేర్కొన్న  రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:

  1. ఓ అండ్ ఎం డివిజన్ – 1 : మిరాలం, కిషన్ బాగ్, అల్జుబైల్ కాలనీ.
  2. ఓ అండ్ ఎం డివిజన్ – 2(A): సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్ గూడ, ఆస్మన్ గఢ్, యాకుత్ పుర, మాదన్నపేట్, మహబూబ్ మాన్షన్.
  3. ఓ అండ్ ఎం డివిజన్ – 2(B) : రియాసత్ నగర్, ఆలియాబాద్.
  4. ఓ అండ్ ఎం డివిజన్ – 4 : బొగ్గుల కుంట, అఫ్జల్ గంజ్.
  5. ఓ అండ్ ఎం డివిజన్ – 5 : నారాయణ గూడ, అడిక్ మెట్, శివం రోడ్, నల్లకుంట, చిలుకల గూడ.
  6. ఓ అండ్ ఎం డివిజన్ – 10 (A) : దిల్ సుఖ్ నగర్ ప్రాంతం.
  7. ఓ అండ్ ఎం డివిజన్ – 20 : బొంగులూరు.
  8. ఓ అండ్ ఎం డివిజన్ – 22 : మన్నెగూడ.

Latest News

More Articles