Saturday, May 18, 2024

ఆ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

spot_img

హైదరాబాద్:  కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ – 1 లో మిరాలం, అలియాబాద్ ఆఫ్ టేక్ ప్రాంతం వద్దనున్న 1200 ఎంఎం డయా పీఎస్సీ ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైనుకు జంక్షన్ పనులు చేపడుతున్నారు. చంద్రాయణగుట్టలోని సన్నీ గార్డెన్ నుంచి షోయబ్ హోటల్ వరకు చేపడుతున్న బాక్స్ డ్రెయిన్ పనులకు ఇబ్బందులు కలగకుండా ఈ జంక్షన్ పనులు చేయనున్నారు జలమండలి అధికారులు.

Also Read.. సోనియమ్మ జన్మదినం ముగిసి నలభై రోజులైంది.. నయాపైసా ఇయ్యారా..!

దీంతో జనవరి 20వ తేదీ ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా జనవరి 21 ఉదయం 6 గంటల వరకు పనులు జరుగుతాయి. ఈ 24 గంటలు రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.

1. ఓ అండ్ ఎం డివిజన్ – 1 : మిస్రిగంజ్, బహదూర్ పుర, కిషన్ బాగ్, జహానుమా, మొఘల్ పుర, దారుల్ షిఫా, సుల్తాన్ షాహి, పత్తర్ ఘట్టి, అల్జుబైల్ కాలనీ.

2. ఓ అండ్ ఎం డివిజన్ – 2 : అలియాబాద్, గౌలిపుర, తలబ్ కట్ట, రియాసత్ నగర్ ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని వెల్లడించారు.

Latest News

More Articles