Saturday, May 18, 2024

మహిళలకు నమస్కారం కాదు.. సమానత్వం కావాలి.. బీజేపీకి ఎంపీ కనిమొళి చురక

spot_img

ఎన్నికలు సమీపిస్తుండటంతో మహిళా బిల్లును బీజేపీ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు మీద ఈ రోజు లోకసభలో 7 గంటల పాటు చర్చించనున్నారు. అయితే ఈ బిల్లు గురించి డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతుండగా.. బీజేపీ సభ్యులు హేళన చేశారు. దాంతో వెంటనే స్పందించిన కనిమొళి.. మహిళలకు నమస్కారాలు కాదు.. సమానత్వం కావాలని చురకలంటించారు. బీజేపీ సభ్యుల తీరును డీఎంకే ఎంపీలు తప్పుబట్టారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కనిమొళికి మద్ధతుగా నిలిచారు. రాజకీయ లబ్ధి కోసమే మహిళా బిల్లును బీజేపీ తెస్తోందని ఎంపీ కనిమొళి అన్నారు. బిల్లు కోసం గతంలో ఎన్నోసార్లు ఆందోళనలు జరిగాయని కనిమొళి గుర్తుచేశారు.

ఎన్నికల కోసమే మహిళ బిల్లును బీజేపీ తీసువచ్చిందని టీఎంసీ ఎంపీ కంకోలి ఘోషి విమర్శించారు. మహిళల హక్కులపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని అన్నారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని ఘోషి డిమాండ్ చేశారు. రెజ్లర్లపై వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఎందుకు చర్యలు తీపుకోలేదని లోకసభ సాక్షిగా ప్రశ్నించారు.

Read Also: ప్రేమించట్లేదని యువతికి పురుగుల మందు తాగించిన ఇద్దరు పిల్లల తండ్రి

బీజేపీ తెచ్చిన మహిళా బిల్లు 2024 ఎన్నికల జుమ్లా అని జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. తక్షణమే కులాలవారీగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. కులాలవారీగా జనగణనతో ప్రతి వర్గానికి న్యాయం జరుగుతుందని రంజన్ సింగ్ అన్నారు.

కాగా.. లోక్ సభలో మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ తమ మద్ధతు ప్రకటించింది. అందులో భాగంగానే సోనియా గాంధీ మహిళా బిల్లుపై లోకసభలో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లను రాజీవ్ గాంధీ అందించారని గుర్తుచేశారు. ఈ మహిళా బిల్లుకు డీఎంకే, టీఎంసీ, వైఎస్ఆర్సీపీ, జేడీయూ, బీజేడీ, బీఎస్పీ, తదితర పార్టీలన్నీ మద్ధతు తెలిపాయి.

Read Also: హైకోర్టులో నవదీప్‌కు షాక్‌.. నోటీసులివ్వాలని కోర్టు ఆదేశం

Latest News

More Articles