Friday, May 17, 2024

వేసవిలో పుచ్చకాయ తింటే ఎంత మంచిదో తెలుసా?

spot_img

వేసవికాలం వచ్చిందంటే పుచ్చకాయలు విరివిగా లభిస్తాయి. పుచ్చకాయల ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుస్తే..ఈ పండ్ల ముక్కలను రోజూ తింటారు. పుచ్చకాయలో 95శాతం నీరు ఉంటుంది.వేసవిలో దాహాన్ని తీర్చడానికి పుచ్చకాయ తినడం ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు పుచ్చకాయ శరీరానికి చల్లదన్నానిస్తుంది. తక్కువ కెలోరీలు వుండటం వల్ల దీన్ని తింటే బరువు సులభంగా తగ్గుతారు.

పుచ్చకాయలో ఎర్రని భాగంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అంతేకాదు వెనుకగల తెల్లని కండ భాగంలో కూడా పోషకాలెన్నో ఉంటాయి. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్ వంటి, క్యాన్సర్ నిరోధకాలున్నాయి. ఇందులోని లైకోపెన్ అనే రసాయనం మిగతా పళ్లూ, కూరగాయలతో పోలిస్తే అధికంగా ఉంటుంది. ఇది ప్రొస్టేట్, రొమ్ము, జీర్ణశయ క్యాన్సర్లతో పాటు గుండెకు సంబంధించిన వ్యాధులను దూరం చేస్తుంది. పుష్కలంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.

ఇందులో అత్యధికంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు పనితీరు పెంచి, కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరచడంలో పుచ్చకాయ అద్భుతంగా పనిచేస్తుంది. వృద్ధాప్య ఛాయలను నియంత్రించడంలో పుచ్చకాయ సూపర్‌ ఫుడ్ అని చెప్పవచ్చు. ఇందులోని సిట్రుల్లైన్ రసాయనం యాంటీ-ఏజెంట్‌గా పనిచేస్తుంది. కాబట్టి వేసవిలో పుచ్చకాయను రోజూ తీసుకోవడం మరచిపోవద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇది కూడా చదవండి: 500పోస్టులతో తెలంగాణలో భారీ నోటిఫికేషన్.!

Latest News

More Articles