Friday, May 3, 2024

500పోస్టులతో తెలంగాణలో భారీ నోటిఫికేషన్.!

spot_img

నిరుద్యోగులకు శుభవార్త . తెలంగాణలో మరో భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ స్వచ్ఛంద సేవకుల కొరకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రకృతి వైపరీత్యాలైన లాండ్ స్లైడ్స్, భూకంపాలు, తుఫాన్లు, వరదలు మొదలుగునవి సంభవించినప్పుడు స్వచ్ఛందంగా సేవ చేయుటకు సన్నద్దులను చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం.వరంగల్ జిల్లాలో 200 మంది, హనుమకొండ జిల్లాలో 300 మంది ఆపద మిత్రులు/ స్వచ్ఛంద సేవకులకు ఎంపిక చేయుటకు రెండు జిల్లాల విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ బాధ్యులైన వరంగల్,హనుమకొండ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఏప్రిల్ 1 వ తేదీ వరకు 18 సంత్సరాలు నిండిన, 40 సంవత్సరాల వయసు కలిగి ఉండాలని తెలిపారు.

కనీసం 7 వ తరగతి ఉత్తర్ణులైన సేవాభావం కలిగిన స్త్రీ పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వరంగల్, హనుమకొండ జిల్లాల నుండి తమ సేవల అందించుటకు శిక్షణా నిమిత్తం ఎంపిక చేయటం కొరకు దరఖాస్తు ఫారం లను రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ అగ్నిమాపక కేంద్రం వద్ద అందుబాటులో ఉన్నాయి. పూర్తి చేసిన దరఖాస్తులు అగ్నిమాపక కేంద్రము వరంగల్ అగ్నిమాపక కేంద్రం హనుమకొండ లలో తేదీ 06.04.2024 లోపు సమర్పించగలరని జిల్లా అగ్నిమాపక అధికారి మామిడి భగవాన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఇది కూడా చదవండి: నేను గెలిస్తే విదేశీ విస్కీ, బీర్ ఫ్రీ..!

Latest News

More Articles