Friday, May 3, 2024

నేను గెలిస్తే విదేశీ విస్కీ, బీర్ ఫ్రీ..!

spot_img

లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు పలు వాగ్దానాలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఇచ్చే వాగ్దానాలు కొన్నిసార్లు విచిత్రంగా అనిపిస్తాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో కూడా ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ చిమూర్‌ గ్రామానికి చెందిన ఓ స్వతంత్ర అభ్యర్థి 2024ఎన్నికల్లో బరిలోకి దిగింది. ఇక్కడ మహిళా అభ్యర్థి తాను అధికారంలోకి వస్తే పేద ప్రజలకు ఖరీదైన విస్కీ, బీరు ఉచితంగా ఇస్తానంటూ చెప్పుకొచ్చింది.ఆల్ ఇండియా హ్యుమానిటీ పార్టీ అభ్యర్థి వనితా రౌత్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాను గెలుస్తే ప్రతి గ్రామంలో పేదలకు ఎంపీ ఫండ్స్ నుంచి ఉచితంగా ఖరీదైన విస్కీ, బీరు అందిస్తానని తెలిపింది.మరికొందరికి సబ్సిడీతోను విదేశీ మద్యం, బీర్లను ఇస్తామంటూ చెప్పింది.

2019 అసెంబ్లీ (చిమూర్), లోక్ సభ (నాగపూర్) ఎన్నికల్లోనూ ఇలాంటి హామీలే ఆమె ఇచ్చింది. చంద్రాపూర్ జిల్లాలోని చిమూర్ గ్రామానికి చెందిన ఆమె ప్రచారసభల్లో ప్రసంగిస్తూ.. ఎక్కడెక్కడ పల్లెలుంటాయో.. అక్కడ బీరా కా బార్ ఉంటుందని చెప్పింది. అయితే, రేషన్ తరహాలో ఈ మద్యం పంపిణీ ఉంటుందని, అమ్మకందారుడు, వినియోగదారుడికి ‘లైసెన్సు’ ఉండాలని మెలిక పెట్టింది. చీప్లక్కర్ తాగి తాగి వారు స్పృహతప్పి పడిపోతున్నారే తప్ప మద్యం కిక్కులోని ఆనందాన్ని వారు ఆస్వాదించడం లేదని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందుకే ఫారిన్ విస్కీ అందిస్తానని, అది తాగితే వారికి స్వర్గం కనిపిస్తుందని వనితా రౌత్ ఓటర్లు చెబుతోంది.

ఇది కూడా  చదవండి: ఇరాన్‌ ఎంబసీపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి..7 అధికారులు మృతి

Latest News

More Articles