Saturday, May 18, 2024

సమ్మర్ ఎఫెక్ట్: వార్తలు చదువుతూ సొమ్మసిల్లిన దూరదర్శన్‌ యాంకర్‌

spot_img

దేశంలో రోజు రోజుకీ ఎండల తీవ్రత పెరిగిపోతోంది. పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటేనే భయపడుతున్నారు. ఈ క్రమంలోనే దూరదర్శన్‌ ఛానెల్‌కు చెందిన మహిళా యాంకర్‌ ఎండ వేడికి తాళలేక సొమ్మసిల్లి పడిపోయింది. వార్తలు చదువుతూనే కుర్చిలో వెనక్కి వాలిపోయింది. దూరదర్శన్‌ కోల్‌కతా బ్రాంచిలో ఈ ఘటన జరిగింది.

దూరదర్శన్‌ కోల్‌కతా బ్రాంచిలో లోపముద్ర అనే యాంకర్‌ వాతావరణ వార్తలు చదువుతోంది. వార్తలు చదువుతూనే ఆమె కళ్లు మూసుకుంటూ కుర్చీలో వెనక్కి వాలిపోయింది. ఇది గమనించిన స్టూడియో సిబ్బంది వెంటనే ఆమె ముఖంపై నీళ్లు చల్లి సపర్యలు చేశారు. దాంతో ఆమె కళ్లు తెరిచింది.

ఎండలు బాగా మండిపోతున్నాయని, స్టూడియోలో కూలింగ్‌ సిస్టమ్‌ ఉన్నప్పటికీ వేడిగా ఉందని యాంకర్‌ లోపముద్ర చెప్పారు. ఒక్కసారిగా తనకు కళ్లుమూత పడ్డాయని, కళ్లు మసకబారుతూ టెలి ప్రాంప్టర్‌ కనిపించకుండా పోయిందని తెలిపారు. డీ హైడ్రేషన్‌ కారణంగా బీపీ లెవల్స్‌ పడిపోవడమే అందుకు కారణమై ఉంటుందని ఆమె తెలిపారు.

తన 21 ఏళ్ల కెరీర్‌లో 15 నిమిషాలు, 30 నిమిషాల నిడివిగల బులెటిన్‌లు ఎన్నో చదవానని, ఎప్పుడూ ఇలా జరగలేదని అన్నారు. బులెటిన్‌ మధ్యలో ఏనాడు నేను నీళ్లు తాగలేదని, స్టూడియోలో వార్తలు చదివేటప్పుడు పక్కన నీళ్ల బాటిల్‌ పెట్టుకునే అలవాటు కూడా లేదని ఆమె చెప్పారు. విపరీతమైన ఎండలు కారణంగానే సొమ్మసిల్లి పడిపోయానని తెలిపారు.

ఇది కూడా చదవండి: వరకట్నం తీసుకోలేదని అఫిడవిట్‌ ఇవ్వాలి..ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశాలు..!

Latest News

More Articles