Saturday, May 4, 2024

నవంబర్ 1న ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం

spot_img

హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా వాటర్ సప్లై పథకం ఫేజు – 2 లో భాగంగా పటాన్ చెరు నుంచి హైదర్ నగర్ వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీలు అరికట్టడానికి మరమ్మతు పనులు చేపట్టనున్నారు. ఈ పనులు నవంబర్ 1న ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా నవంబర్ 2 ఉదయం 6 గంటల వరకు జరుగుతాయి. ఈ 24 గంటలు జలమండలి పలు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది. వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.

Also Read.. డీకే దుమ్ముదులిపిన హరీష్ రావు..!

అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:

  1. ఓ అండ్ ఎం డివిజన్ – 6 : ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్ (లోప్రెజర్ తో నీటిసరఫరా).
  2. ఓ అండ్ ఎం డివిజన్ – 8 : హఫ్ టేక్ పాయింట్లు, బల్క్ కనెక్షన్లు.
  3. ఓ అండ్ ఎం డివిజన్ – 9 : కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్య నగర్ కాలనీ, వసంత్ నగర్.
  4. ఓ అండ్ ఎం డివిజన్ – 15 : ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతినగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, దీప్తి శ్రీ నగర్, మదీనాగూడ, మియాపూర్.
  5. ఓ అండ్ ఎం డివిజన్ – 24 : బీరంగూడ, అమీన్ పూర్, బొల్లారం.

Latest News

More Articles