Sunday, May 19, 2024

కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడంలేదని కోర్టును ఆశ్రయించిన ఈడీ

spot_img

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో సమన్లు జారీ చేసినా సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విచారణకు హాజరుకాకపోవడంపై ఈడీ రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 7న కోర్టు విచారణ జరుపనున్నది. మనీలాండరింగ్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. రెండు రోజుల క్రితం కేజ్రీవాల్‌కు ఈడీ ఐదోసారి సమన్లు జారీ చేసింది. ఈడీ జారీ చేసిన సమన్లు చట్టవిరుద్ధమని, చెల్లవని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఈడీ విచారణ హాజరుకాకపోవడంపై కేజ్రీవాల్‌పై బీజేపీ కార్యదర్శి బన్సూరి స్వరాజ్‌ విమర్శలు గుప్పించారు.
దర్యాప్తునకు హాజరుకాకపోవడం కేజ్రీవాల్ వైఖరి బాధ్యతారాహిత్యమని, వెళ్లకుండా వింత సాకులు చూపుతున్నారన్నారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమైతే కేజ్రీవాల్ ఎందుకు కోర్టును ఆశ్రయించరని నిలదీశారు. దేశంలోని చట్టం సామాన్యుడితో పాటు ముఖ్యమంత్రికి సమానంగా వర్తిస్తాయన్నారు. చట్టవిరుద్ధమని తేలితే కోర్టుకు వెళ్లాలని.. అక్కడ నిజం బయటపడుతుందన్నారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికు పలువురు ఆప్‌ నేతలు అరెస్టయ్యారు. నేతలు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను కోర్టులు కొట్టివేశాయి.

ఇది కూడా చదవండి: మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న విరుష్క జంట !

Latest News

More Articles