Saturday, May 18, 2024

పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కు ప‌దేళ్ల జైలు శిక్ష‌

spot_img

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు భారీ షాక్ తగిలింది. అతనికి 10 ఏండ్ల జైలు శిక్ష విధించింది పాకిస్థాన్ కోర్టు. సైఫర్ కేసులో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌కు శిక్ష ఖరారు చేసింది ప్రత్యేక కోర్టు. ఇమ్రాన్ ఖాన్‌తో పాటు, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీకి కూడా 10 సంవత్సరాల శిక్ష పడింది. అధికారిక రహస్యాల చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ఇద్దరు నేతలపై ఈ తీర్పునిచ్చింది.

ఈ కేసులో డిసెంబర్ 2023లో, దేశ అత్యున్నత న్యాయస్థానం ఇమ్రాన్ ఖాన్ తోపాటు షా మహమూద్ ఖురేషీల అరెస్టు తర్వాత బెయిల్‌ మంజూరు చేసింది. మాజీ ప్రధాని ఇతర కేసులలో జైలులోనే ఉన్నారు. అయితే మాజీ విదేశాంగ మంత్రి విడుదల కూడా నిలిపివేసింది పాక్ సర్కార్. అయితే మరో కేసులో అరెస్ట్ కావడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఇద్దరు నేతలు జైలులో ఉన్నారు. ఈ కేసులో ఈ ఇద్దరు నేతలు సైతం ఈ తప్పును అంగీకరించలేదు. అప్పటి నుంచి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

ఇది కూడా చదవండి: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హైకోర్టు బ్రేక్

Latest News

More Articles