Saturday, May 18, 2024

అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్ నివాళులు అర్పించక పోవడం దారుణం

spot_img

రిపబ్లిక్ డే రోజున అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించక పోవడం దారుణమని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్‎లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, మాజీ మంత్రి బొడ జనార్ధన్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ పాల్గొన్నారు.

Read Also: సీఐడీ అధికారులమంటూ ఐటీ కంపెనీని బెదిరించి రూ. 10 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

ఈ సందర్భంగా విఠల్ మాట్లాడుతూ.. ‘గత పది సంవత్సరాలలో బెల్లంపల్లి నియోజకవర్గాన్ని కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్నాం. చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు చెప్పడంలో విఫలం అయ్యాం. రిపబ్లిక్ డే రోజున సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులు ఆర్పించక పోవడం దారుణం. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. రాబోయే లోక్ సభ ఎన్నికల కోసం బూత్, సోషల్ మీడియా కమిటీలు చురుగ్గా పనిచేయాలి. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం. కేసీఆర్ నాయకత్వంలో పది సంవత్సరాల్లో తెలంగాణను అగ్రగామిగా అభివృద్ధి చేశాం. గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా ఎల్లవేళలా ప్రజల కోసం పనిచేస్తాం. కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటాం’ అని ఎమ్మెల్సీ విఠల్ అన్నారు.

Latest News

More Articles