Sunday, May 19, 2024

రామేశ్వరం కేఫ్ లో పేలుడు..వ్యక్తి అరెస్టు.!

spot_img

కర్నాటకలో రామేశ్వరం కేఫ్ లో మార్చి 1వ తేదీన జరిగిన పేలుడుపై దర్యాప్తు కొనసాగుతోంది. కర్నాటక పోలీసులతోపాటు కేంద్ర ఏజెన్సీలు కూడా ఈ విషయంపై నిఘా పెట్టాయి. ముందుగా గ్యాస్ సిలిండర్ పేలిందని అనుమానపడ్డారు. కానీ ఓ గుర్తుతెలియని వ్యక్తి కేఫ్ లో బ్యాగు పెట్టాడని..అందులో నుంచే పేలుడు సంభవించినట్లు సర్కార్ నిర్దారించింది. తాజాగా ఈ కేసుపై కీలక అప్ డేట్ వచ్చింది. కేఫ్ లో బాంబు అమర్చిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోటల్ పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. 25నుంచి 30ఏళ్ల మధ్య వయస్సున్న వ్యక్తి బాంబు పెట్టినట్లు స్పష్టం అర్థమవుతోంది. అతడి ముఖ కవళికలు స్పష్టంగా కనిపిస్తున్నాయని..మరికొద్ది గంటల్లోనే అతడిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

ఈ పేలుడుకు సంబంధించి బెంగుళూరులోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్లో చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం, పేలుడు పదార్థల చట్టం కింద కేసు నమోద అయ్యింది. బెంగళూరులోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం జరిగిన పేలుడు తీవ్రత తక్కువగా ఉందని, టైమర్‌తో పేలుడు సంభవించిందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి జి. పరమేశ్వర్‌తో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించిన శివకుమార్, అనంతరం ఆస్పత్రిలో చేరిన క్షతగాత్రులను పరామర్శించారు. శివకుమార్ మాట్లాడుతూ.. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటన రామేశ్వరం కేఫ్‌లో చోటుచేసుకుంది. 28 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న ఓ యువకుడు కేఫ్‌కు వచ్చి, కౌంటర్‌లో రవ్వ ఇడ్లీ కొనుగోలు చేసి, కేఫ్‌ ముందు ఉన్న చెట్టు దగ్గర బ్యాగ్‌ను ఉంచి వెళ్లిపోయాడు. బ్యాగ్ ఉంచిన గంట తర్వాత పేలుడు సంభవించింది.

ఇది తక్కువ తీవ్రత కలిగిన బాంబు పేలుడు అని అన్నారు. అతను ఒక గంట తర్వాత పేలుడు సంభవించడానికి టైమర్‌ను సెట్ చేసాడు.” దర్యాప్తును సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సిసిబి)కి అప్పగించినట్లు ఆయన చెప్పారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌, బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌లు సంఘటనా స్థలంలో ఉన్నాయి. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయని, అయితే ఎవరి పరిస్థితి విషమంగా లేదని, అందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ ఆందోళలనకు తలొగ్గిన సర్కార్..మేడిగడ్డకు రిపేర్ చేయిస్తామన్న మంత్రి ఉత్తమ్.!

Latest News

More Articles