Sunday, May 19, 2024

బీఆర్ఎస్ ఆందోళలనకు తలొగ్గిన సర్కార్..మేడిగడ్డకు రిపేర్ చేయిస్తామన్న మంత్రి ఉత్తమ్.!

spot_img

బీఆర్ఎస్ న్యాయపరమైన ఆందోళనలకు అధికారి కాంగ్రెస్ మరోసారి తలొగ్గింది. మేడిగడ్డకు మరమ్మత్తులుచేస్తామని ప్రకటించింది. పంటలుకాపాడాలన్న బీఆర్ఎస్ నేతల డిమాండ్ కు ప్రభుత్వం దిగొచ్చింది. బ్యారెజ్ కు మరమ్మత్తులు చేసి రైతన్నలకు సాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పడే దీనికి నిదర్శనం. శుక్రవారం సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మేడిగడ్డ బరాజ్ పై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నెల రోజుల్లో నివేదిక అందజేస్తుందని..దాని ఆధారంగానే బరాజ్ కు మరమ్మత్తులు చేసి రైతులకు నీళ్లు అందిస్తామన్నారు. మేడిగడ్డను ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించిందని రికార్డుల్లో సబ్ కాంట్రాక్టర్ల పేర్లు లేవన్నారు. కాబట్టి ఆ సంస్థకు సంబంధించి రూ. 400కోట్ల నిధులు పెండింగ్ లో పెట్టినట్లు మంత్రి వివరించారు. తాను శనివారం ఢిల్లీ వెళ్తున్నానని మేడిగడ్డ అంశంపై పలువురు నిపుణులను, అధికారులను కలుస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

ఇది కూడా  చదవండి: ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. నిమిషం నిబంధనపై కీలక నిర్ణయం.!

Latest News

More Articles