Tuesday, May 7, 2024

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. నిమిషం నిబంధనపై కీలక నిర్ణయం.!

spot_img

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది ఇంటర్ బోర్డు. వార్షిక పరీక్షలకు హాజరయ్యే వారికి ఉన్న 1 నిమిషం నిబంధనను సడలించింది. ఆలస్యంగా వచ్చే వారిని కూడా అనుమతించాలని కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నిర్దిష్ట కారణాలతో పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా చేరుకునేవారిని ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ తో అనుమతించాలని కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లకు ఇంటర్ బోర్డు సూచించింది. ఇంటర్ బోర్డు తీసుకున్న తాజా నిర్ణయంతో ఉదయం 9 గంటలు అంటే 9.5గంటల వరకు విద్యార్థులను పరీక్షకు అనుమతించనున్నారు. అయితే ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం 8.45 గంటల లోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని బోర్డు సూచించింది. నిమిషం నిబంధన కారణంగా ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన సంచలనంగా మారడం్తో తాజాగా ఈ నిబంధనను తీసుకువచ్చింది బోర్డు.

ఇది కూడా చదవండి: భర్తలను భార్యలు పొట్టు పొట్టు కొట్టేది ఎక్కడో తెలుసా..!!

Latest News

More Articles