Monday, May 20, 2024

ఈ తేదీలోపు ఫాస్టాగ్ ఈ-కేవైసీ అప్ డేట్ చేయకుంటే డీయాక్టివేషనే..!!

spot_img

జాతీయ రహదారుల నిర్వహణకు అవసరమైన నిధుల సేకరణకు వాహనదారుల నుంచే కేంద్రం టోల్ ఫీజులను వసూలు చేస్తోంది. అయితే టోల్ గేట్ల వద్ద వాహనాదారులు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ లోనే టోల్ ప్లాజాల దగ్గర డిజిటల్ గా టోల్ ఫీజు చెల్లించేందుకు ఫాస్టాగ్ విధానాన్ని తీసుకువచ్చింది. ఫాస్టాగ్ విధానాన్ని వాహనదారులు ఇష్టానుసారంగా వాడుతుండటంతో కేంద్ర జాతీయరహదారుల ప్రాధికార సంస్థ వారి నుంచి ఈ కేవైసీ తీసుకోవాలని నిర్ణయించింది.

గత నెలాఖరు వరకు తొలుత గడువు విధించిన ఎన్ హెచ్ఏఐ తాజాగా మరోసారి గడువును పొడిగించింది. ఈనెల 29 వరకు ఫాస్టాగ్ ఈకేవైసీ అప్ డేట్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ గడువు ముగిసిన తర్వాత కేవైసీ పూర్తి చేయాని ఫాస్టాగ్ అకౌంట్లను డీయాక్టివేషన్ చేస్తామని తేల్చిచెప్పింది. ఫాస్టాగ్ వెబ్ సైట్ తోపాటు నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ వెబ్ సైట్ ద్వారా వాహనదారులు తమ ఫాస్టాగ్ ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని పేర్కొంది.

వాహనాల యాజమానులు తమ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ తెలుసుకునేందుకు వెబ్ సైట్ల లింక్ పై క్లిక్ చేసి..మొబైల్ నెబర్, పాస్ వర్డ్ లేదా ఓటీపీ నమోదు చేసుకుని లాగిన్ అవ్వాలి. డాష్ బోర్డులోకి వెళ్లి మై ప్రొఫైల్ ఆప్షన్ సెలక్ట్ చేసుకుని మీ కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది. కేవైసీ పూర్తి కాకుంటే అడిగిన వివరాలు నమోదు చేసి ప్రాసెస్ చేయాలి. ఎన్ హెచ్ఏఐ వద్ద మీ మొబైల్ ఫోన్ నెంబర్ రిజిస్టర్ కాకుంటే మై ఫాస్టాగ్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని అందులోని మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ బ్యాంకులు జారీ చేసిన ఫాస్టాగ్ లు అయితే ఆయా బ్యాంకుల శాఖకు వెళ్లి మొబైల్ నెంబర్ నమోదు చేసిన అనంతరం ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి.

ఇది కూడా చదవండి: పెన్షన్ కోసం రోడ్డెక్కిన ఆసరా పెన్షన్ దారులు..!

Latest News

More Articles